సినిమా ఇండస్ట్రీలోకి తల్లితండ్రుల పేరు చెప్పుకొని వచ్చినంత మాత్రాన అవకాశాలు రావని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు నిరూపించారు.ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వారిలో టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగలేరని ఎంతోమంది కనుమరుగైన స్టార్ కిడ్స్ ను చూస్తేనే తెలుస్తుంది.
ఇక ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి ఒకరు.శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు.
అయితే శ్రీదేవి( Sridevi ) కూతురు అని కాకుండా ఈమె అందం టాలెంట్ ద్వారా అవకాశాలను అందుకుంటూ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈమె దేవర సినిమా( Devara Movie ) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో జాన్వీ లుక్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఎన్టీఆర్( NTR ) తో సమానంగా డాన్సులు చేస్తూ కూడా ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈమెలో దాగి ఉన్న టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ డైరెక్టర్స్ ఈమె నటించిన మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే తనకు వరుసగా అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు.ఇంకా దేవర విడుదల కాకుండానే మరో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్( Ramcharan ) సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశారు.అయితే ఈ సినిమా కోసం ఈమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్( Remuneration ) అందుకుంటున్నారని సమాచారం.దేవర సినిమా కోసం నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న జాన్వీ రామ్ చరణ్ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ డబుల్ చేశారని తెలుస్తుంది.
ఈ పాత్రకు ఈమె న్యాయం చేయగలరని డైరెక్టర్ బుచ్చిబాబు( Bucchi Babu ) చెప్పడంతో నిర్మాతలు సైతం ఈమె అడిగిన 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు.ఈ విధంగా రెండో సినిమాకి ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.