పొత్తుకోస‌మే కలిశారా..? ఏపీలో ఆ పార్టీల నేత‌ల మాట ముచ్చ‌ట‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మ‌యం ఉన్నా అన్నిపార్టీలు హ‌డావుడి ఇప్పుడే మొద‌లు పెట్టారు.ప‌ర్య‌ట‌న‌లు, యాత్ర‌లు అంటూ ప‌లు ప్రాంతాల‌పై ఫోక‌స్ పెడుతున్నారు.

 Have You Met For A While The Words Of The Leaders Of Those Parties In The Ap Are-TeluguStop.com

ఈ క్ర‌మంలో పొత్తుల అంశం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.అధికార పార్టీని అడ్డుకోవ‌డానికి అన్ని పార్టీలు ఏకం అయ్యేలా క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే జ‌న‌సేన‌, బీజేపీ ట‌చ్ లో ఉన్న విష‌యం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చెప్పిన సంగ‌తి తెలిసిందే.అయితే గ‌తంలో చంద్ర‌బాబు బీజేపీని వ్య‌తిరేకించ‌డంతో ఇప్ప‌టి వ‌రకు టీడీపీ, బీజేపీ క‌ల‌సి వ‌స్తాయ‌ని అనుకోలేదు.

అయితే తాజా ప‌రిణామాలు చూస్తుంటే మాత్రం పొత్తుకు సై అంటున్నాయేమో అనిపిస్తుంది.

ఏపీ బీజేపీ అధక్ష్యుడు సోము వీర్రాజు జ‌న‌సేన‌తో పొత్తు ఉంటుంద‌ని కూడా ప‌దే ప‌దే చెప్తున్నాడు.

అయితే టీడీపీ విషంయ‌లో మాత్రం విమ‌ర్శ‌లు గుప్పింస్తుంటారు.అయితే ప్ర‌స్తుతం సోము వీర్రాజు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు క‌లుసుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

అయితే సోము వీర్రాజు టెక్కలిలో ప‌ర్చ‌టిస్తున్నాడు.అందులో భాగంగా కాపు తెంబూరు గ్రామంలో ఉన్న గ్రామ దేవత బొంగు పోలమ్మ అమ్మవారి దర్శనానికి సోము వీర్రాజు వ‌చ్చాడు.

అయితే స‌రిగ్గా అదే సమయంలో అచ్చెన్నాయుడు కూడా అక్కడకు రావడంతో ఇద్దరూ పలకరించుకున్నారు.షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.

అయితే ఈ సంఘ‌ట‌న అనూహ్యంగా జ‌రిగింద‌నే చెప్పాలి.

Telugu Andhra Pradesh, Janasena, Jp Nadda, Tekkali, Somu Veerraju-Political

కాగా అంతకు ముందే సోము వీర్రాజు ఓ ప్రోగ్రాంలో టెక్కలిలో మైనింగ్ గనులను అటు అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష నాయకుడు అచ్చెన్నాయుడు కూడా కలిపి దోచుకుంటున్నార‌ని ఆరోపించాడు.ఆ త‌ర్వాత అచ్చెన్నాయుడితో క‌ల‌సి గుడివ‌ద్ద మాట్లాడుకోవ‌డం జ‌రిగిపోయింది.ఏదేమైన‌ప్ప‌టికీ రెండు పార్టీల శ్రేణుల్లో కొంత జోష్ వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

దీంతో టీడీపీ, బీజేపీ దోస్తీకి సిద్ద‌మైన‌య‌నే చ‌ర్చ మొద‌లైంది.అయితే చంద్ర‌బాబు విష‌యంలో బీజేపీ వ్య‌తిరేక‌త ఉండ‌టంతో ఇక ఏమవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube