గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ ( Bangladesh )లో జరుగుతున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన సోమవారం నాడు నిర్ణయాత్మక మలుపు చోటు చేసుకుంది.వందల మంది ఆందోళనకారులు రెచ్చిపోయి ఒక్కసారిగా ప్రధాని నివాసంలోకి ప్రవేశించి బీభత్సన్నీ సృష్టించారు.
ఇక దేశంలో పరిస్థితి అదుపు తప్పడం గ్రహించిన ప్రధాని షేక్ హసీనా ( Prime Minister Sheikh Hasina )దేశం విడిచి భారత్ కు పారిపోయి వచ్చింది.దింతో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎవరు నెక్స్ట్ పీఎం ఎవరని అందరూ చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ను( Nobel Laureate Muhammad Yunus ) బాంగ్లాదేశ్ దేశ కొత్త ప్రధానిగా ఎంపిక అయ్యే అవకాశం ఉంది.ఇక దేశంలోని నిరసనకారుల దూకుడును గమనించి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసింది.దింతో ఇప్పుడు ఆ దేశం ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్( Army Chief General Waqar-uz-Zaman ) రాజధాని ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని ఆయన ప్రకటించారు.
ఇకపోతే మొహమ్మద్ యూనస్ గురించి చూస్తే.ఆయన జూన్ 28, 1940 న జన్మించాడు.1961 నుండి 1965 వరకు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు.ఆపైవాండర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టాను సంపాదించారు.అయన ఓ సామాజిక వ్యవస్థాపకుడు, బ్యాంకర్, ఆర్థికవేత్త, పౌర సమాజ నాయకుడు ఇలా ఎన్నో.2006 లో అయన గ్రామీణ బ్యాంకును స్థాపించి.మైక్రోక్రెడిట్, మైక్రోఫైనాన్స్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాడు.
దాంతో ఆయనకు 2006లో నోబెల్ శాంతి బహుమతి వరించింది.మైక్రో క్రెడిట్ ద్వారా ఎంతోమంది దిగువ స్థాయి నుండి ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కలిగేలా చేసిన ఆయన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది.
ఆ తరవాత 2009లో అమెరికా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం కూడా లభించింది.ఆ తదుపరి 2010లో కాంగ్రెస్ గోల్డ్ మెడల్ సంపాదించారు.
ఇంకా మరెన్నో అవార్డులు ఆయన అందుకున్నారు.