తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో షోలకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు,ఆడియో ఫంక్షన్లకు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో ఆకట్టుకోవడంతో పాటు ఎలాంటి పరిస్థితులను అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది.
పంచులు వేయడంతో పాటు ఎదుటి వాళ్ళ పంచులకు రివర్స్‌లో కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది.ఇకపోతే చాలామంది యాంకర్ సుమ కోసం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆడియో ఫంక్షన్లను పోస్ట్ ఫోన్ చేసుకుంటూ ఉంటారు.
అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమకు తాజాగా ఒక ఇబ్బందిరక పరిస్థితి ఎదురైంది.తంగలాన్ సినిమా( Thangalaan ) ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు డేనియల్ కాల్టగిరోన్( Actor Daniel Caltagirone ) ను స్టేజీపైకి ఆహ్వానించిన సుమ అతడితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది.అందరూ బాగున్నారా? మీరు తప్పకుండా ఈ సినిమాను ఆగస్టు 15న చూడాలి అని చెప్పించింది.చివర్లో చిన్న ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది.ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమయే అందంగా ఉంది అని నటుడితో అనిపించింది.
ఆ లైన్ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది.కానీ డేనియల్ మాత్రం ఆమె చేతికి ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా అవాక్కయింది.వెంటనే తమాయించుకుని సరదాగా స్పందించింది.ఆ ఘటనపై వెంటనే స్పందించిన సుమ ఓరి నాయనో రాజా, ఈయన మా అన్నయ్య.రాఖీ పండగ వస్తోంది అంటూ కవర్ చేసి అన్నయ్య సన్నిధి అని పాట అందుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.