2024 సంవత్సరం మెగా నామ సంవత్సరం.. నిహారిక కామెంట్స్ ప్రేక్షకుల్లో సంతోషం నింపాయిగా!

మెగా డాటర్ నిహారికకు( Mega daughter Niharika ) ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరికొన్ని రోజుల్లో కమిటీ కుర్రాళ్లు సినిమాతో నిహారిక ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 2024 Is The Mega Family Year Details Inside Goes Viral In Social Media , Social-TeluguStop.com

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిహారిక మాట్లాడుతూ 2024 సంవత్సరం మెగా నామ సంవత్సరం ( mega family year )అనే అర్థం వచ్చేలా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

నిహారిక మాట్లాడుతూ మా అన్నయ్య వరుణ్ తేజ్ ( Varun Tej )నాకెప్పుడూ సపోర్ట్ చేస్తూ నా వెంటే ఉంటాడని తెలిపారు.

ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే మా బావ ఈ వేదికపై ఉండడం చాలా ఆనందంగా ఉందని నిహారిక చెప్పుకొచ్చారు.ఈ సినిమా తర్వాత కనిటీ కుర్రోళ్లు డైరెక్టర్ వంశీ( Director Vamsi ) పేరు ఇండస్ట్రీలో వినిపిస్తుందని నిహారిక కామెంట్లు చేశారు.

ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులను పెట్టాలని అనుకున్నానని నిహారిక తెలిపారు.

Telugu Vamsi, Niharika, Sai Kumar, Varun Tej-Movie

ఆ సమయంలో వంశీ మాత్రం కొత్తవారితో చేద్దామని అన్నారని నిహారిక వెల్లడించారు.ప్రస్తుతం 15 మంది టాలెంట్ ఉన్న యాక్టర్లను ఇండస్ట్రీకి తెచ్చామనే సంతృప్తి నాకు ఉందని నిహారిక చెప్పుకొచ్చారు.కమిటీ కుర్రాళ్లు సినిమాకు( Committee Kurrallu ) సాయికుమార్ ప్రత్యేక ఆకర్షణ అని ఆమె కామెంట్లు చేశారు.

ఆగష్టు 9వ తేదీన కమిటీ కుర్రోళ్లు ప్రేక్షకుల ముందుకు రానుందని నిహారిక అభిప్రాయపడ్డారు.

Telugu Vamsi, Niharika, Sai Kumar, Varun Tej-Movie

ఈ సంవత్సరం మా కుటుంబానికి అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు.మా చరణ్ అన్న సినిమా ఆస్కార్స్ కు వెళ్లిందని నిహారిక పేర్కొన్నారు.మా పెదనాన్నకు పద్మ విభూషణ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

మా బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారని నిహారిక కామెంట్లు చేశారు.నేను కూడా నా ఫస్ట్ మూవీతో వస్తున్నానని నిహారిక తెలిపారు.

నిహారిక చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube