కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) ఒకరు కాగా విజయ్ సేతుపతి హిట్ సినిమాలలో 96 సినిమాను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు.ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా త్రిష నటించారు.2018 సంవత్సరంలో విడుదలైన 96 మూవీ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.యువ ప్రేక్షకుల హృదయాలను ఈ సినిమా దోచేసింది.

గతంలో 96 సినిమాకు సీక్వెల్( 96 moviesequel )
వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరగగా ఆ ప్రచారం గురించి డైరెక్టర్ నుంచి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది.96 సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని మొదట ఫీల్ కాలేదని ఆ సినిమాకు దక్కిన ప్రేక్షకాదరణే సినిమా కొనసాగింపునకు ప్రేరణ అని దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశామని విజయ్ సేతుపతి, త్రిష ( Trisha )ప్పుడు డేట్స్ కేటాయిస్తే అప్పుడు మూవీ ప్రారంభిస్తానని ఆయన తెలిపారు.

96 మూవీ తెలుగులో జాను పేరుతో రీమేక్ కాగా తెలుగులో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.96 మూవీని అప్పటికే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు చూడటం, జాను మూవీ ఆలస్యంగా రిలీజ్ కావడం, శర్వానంద్ సమంత మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడం జాను ఫ్లాప్ కు కారణమయ్యాయి.విజయ్ సేతుపతి ఇటీవల మహారాజ సినిమాతో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.96 సినిమాకు సీక్వెల్ అంటే ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాపై తెగ ఆసక్తి చూపే ఛాన్స్ అయితే ఉంది.అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
స్క్రిప్ట్ అద్బుతంగా ఉంటే మాత్రమే 96 సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
విజయ్ సేతుపతి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.