నల్లగొండ జిల్లా: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ స్కీంలో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) ఉదయం ప్రమాదం జరిగింది.
సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం సంభవించింది.
టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
ఇప్పటికైతే ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని అన్నారు.