టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది హిట్ గా నిలిచిన సినిమాలలో డాకు మహారాజ్( Daaku Maharaaj ) ఒకటి.బాబీ డైరెక్షన్ లో( Director Bobby ) తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.నిన్నటినుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో( Netflix ) స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.హిందీ సినిమాలను సైతం వెనక్కు నెట్టి డాకు మహారాజ్ టాప్ లో నిలవడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలలో కనిపించడం జరిగింది.

ఊర్వశి రౌతేలా ఈ సినిమా కోసం 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.డాకు మహారాజ్ మూవీ నిర్మాతలకు ఒకింత భారీగానే లాభాలను అందించింది.అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య( Balayya ) ఖాతాలో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయనే సంగతి తెలిసిందే.

డాకు మహారాజ్ సినిమాకు సరైన రేంజ్ లో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా సులువుగానే 100 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకుని ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.డాకు మహారాజ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.బాలయ్య డాకు మహారాజ్ సినిమా ఇతర భాషల్లో మాత్రం ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.







