నల్గొండ జిల్లా:జిల్లాలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌లో శనివారం ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ప్రమాద సమయంలో 35 మంది కార్మికులు టన్నెల్‌లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా టన్నెల్ కుంగిపోయింది.
అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు.ఘటనపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్,ఎస్పీ, అగ్నిమాపక శాఖ,హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్,ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరినట్లు సమాచారం.