నేటి కాలంలో చాలా మందికి మద్యం అలవాటు ఉంటుంది.మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.
ఎవరూ పట్టించుకోరు.అయితే కొందరు మద్యానికి బానిసై తాగుతుంటే.
మరికొందరు ఫ్యాషన్‌గా భావించి తాగుతుంటారు.కానీ, ఎలా తాగినా.
ఆరోగ్యానికి హానే జరుగుతుంది.ఇక మద్యం సేవించే వారి లివర్ క్రమంగా క్షీణిస్తుంది.
అలా క్షీణించకుండా ఉండాలీ అంటే.ఖచ్చితంగా పలు ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
మద్యం అలవాటు ఉన్న వారు ప్రతి రోజు నట్స్ తీసుకోవాలి.
ఎందుకంటే, నట్స్‌లో విటమిన్ ఇ, గుడ్ ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
అలాగే గ్రీన్ టీ సేవించడం వల్ల లివర్ ఫ్యాట్ కరిగిపోయి.దాని పని తీరు మెరుగుపడుతుంది.
అందువల్ల, మందుబాబులు తప్పని సరిగా ఉదయం లేదా ఏదో ఒక సమయంలో ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బీట్ రూట్, క్యారెట్ కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.ప్రతి రోజు బీట్ రూట్, క్యారెట్‌లతో తయారు చేసిన జ్యూస్‌ను సేవించడం వల్ల.అందులో ఉండే పలు పోషకాలు కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి సహాయపడతాయి.
మరియు బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తహీనత కూడా దూరం అవుతుంది.అలాగే విటమిన్ సి లివర్‌ను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
అందువల్ల, విటమిన్ సి పుష్కలంగా ఆహారాన్ని డైలీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
ఇక మందుబాబు లివర్‌ను కాపాడుకోవాలంటే.
వేడి నీళ్లలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపునికుని ప్రతి రోజు తీసుకోవాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ ఫ్యాటీ లివర్‌ను కరిగించడంతో… పాటు కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది.
ఇక వీటితో పాటుగా వెల్లుల్లి, బొప్పాయి, యాపిల్, అవోకాడో, ఆలివ్ ఆయిల్ వంటివి డైట్‌లో చేర్చుకుంటే.లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.