నల్లగొండ జిల్లా: కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి చెందిన విషయం బయటికి పొక్కడంతో బర్ద్ ఫ్లూ కలకలం రేగింది.
మొత్తం 13 వేల కోళ్లను కొనుగోలు చేయగా అందులో 7000 కోళ్లు మరణించగా జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టినట్లు సమాచారం.
దీంతో పౌల్ట్రీ యజమానికి 4 లక్షల వరకు నష్టం జరిగిందని తెలుస్తోంది.