నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ పరిధిలోని ఈదూలగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో
రూ.6 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళుతున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని,వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.