నల్లగొండ జిల్లా:ఏబీవీపీ మహిళా నాయకురాలు హరితను చేయిపట్టి అనాగరికంగా ప్రవర్తించిన శాలిగౌరారం సీఐ రాఘవరావుపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీకి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,కంచర్ల సాగర్ రెడ్డి,ఎస్కే పాషా, మంగళపల్లి కిషన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.