మొటిమలు..యువతీయువకులను వేధించే ప్రధాన చర్మ సమస్య ఇది.ఈ మొటిమలను తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ, ఇవి మాత్రం పోవు.అయితే ముల్తానీ మట్టితో కొన్ని వంటింటి పదార్థాలు కలిపి రాస్తే.సులువుగా మొటిమలను నివారించుకోవచ్చు.మరియు చర్మాన్ని కాంతివంతంగా కూడా మార్చుకోవచ్చు.
ముల్తానీ మట్టిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుతాయి.మొటిమలే కాదు.
వాటి వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి.
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్, గంధం పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు మటుమాయం అవ్వడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది.
ముల్తానీ మట్టిలో కొద్దిగా తేనే, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల కూడా మొటిమలు పోతాయి.అలాగే చర్మం మంచి రంగు సంతరించుకుని కాంతివంతంగా మారుతుంది.