అష్ట లక్ష్ములు ఎవరు? ఎవరి వల్ల ఏం వస్తుంది?

మానవాళికి అవసరం అయిన 8 రకాల లక్ష్యాలను నెరవేర్చేందుకు సాక్యాత్తు ఆ లక్ష్మీదేవియే ఆ అష్ట లక్ష్ములుగా అవతరించింది.

లక్ష్మీ అనగా లక్ష్యానికి దారి తీసే దేవత అని అర్థం.

 లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్ష్యం పొందినట్లేనని భక్తులు భావిస్తారు.భక్తుల కోసం 8 రూపాలుగా అవతరించిన లక్ష్మీ దేవి రూపాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా ఆదిలక్ష్మి.ఈమెనే మహాలక్ష్మి అని కూడా అంటారు.

ఆమెకు పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.రెండోది ధాన్య లక్ష్మి.

Advertisement

ధాన్య లక్ష్మి పూజ చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని ప్రతీతి.మూడోది ధైర్య లక్ష్మి.

ఈ దేవతను పూజించడం వల్ల చాలా ధైర్యం వస్తుందని నమ్మకం.నాలుగోది గజలక్ష్మి.

ఈమె రాజ్య ప్రదాత.ఈమెకు పూజ చేయడం వల్ల సర్వ ఫలాలు అందుతాయని చెబుతుంటారు.ఐదోది సంతాన లక్ష్మి.

సంతానం లేని వారు ఈ దేవిని పూజించడం వల్ల సంతానం కల్గుతుందని ప్రతీతి.ఆరోది విజయ లక్ష్మి.విజయం ప్రాప్తించాలంటే ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

ఏడోది విద్యా లక్ష్మి.ఈ దేవిని పూజించడం వల్ల చదువు బాగా వస్తుందని భక్తుల నమ్మకం.

Advertisement

 ఎనిమిదోది ధన లక్ష్మి.ఈ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేస్తే… ఇంటి నిండి ధనం చేకూరుతుందని ప్రతీతి.

ఇలా అష్ట లక్ష్ములను పూజించడం వల్ల మనకు కావాల్సినవి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు