కొబ్బరికాయ ప్రాముఖ్యత ఏమిటి.. కుళ్ళిన కొబ్బరికాయ చెడుకు సంకేతమా..?

మనదేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.మన దేశంలో పాటించే ఆచార వ్యవహారాలలో కచ్చితంగా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది.

 Siginificance Of Coconut In Pooja, Pooja,coconut,coconut Prasadam,spoiled Coconu-TeluguStop.com

కొబ్బరికాయను శ్రీఫలం అని కూడా అంటారు.శ్రీఫలం( Lakshmi Devi Sri Phalam ) అంటే లక్ష్మీ ఫలం అని కూడా అర్థం వస్తుంది.

పురాణాల ప్రకారం శరీరంలో తల భాగాన్ని కొబ్బరికాయగా పీచు మనిషి యొక్క జుట్టుగా చెబుతారు.కొబ్బరికాయలో ఉండే నీరు మానవ శరీరంలో ఉండే రక్తం గా, ఆ కాయను కొట్టిన తర్వాత కనబడేటటువంటి తెల్లని కొబ్బెర మనసుకు ప్రతికగా చెబుతారు.

ఏ ఫలమైన ఎంగిలి చేయడానికి ఆస్కారం ఉంటుంది.

Telugu Bhakti, Coconut, Devotional, Pooja, Spoiled Coconut-Latest News - Telugu

కొబ్బరికాయ( Coconut )కు అటువంటి ఆస్కారమే ఉండదు అని పండితులు చెబుతున్నారు.అందుచేతనే కొబ్బరికాయను దేవుడికి కొట్టేటప్పుడు మానవునిలో కల్మశం, అహంకారం, ఈర్ష, ద్వేషాన్ని తొలగి కొబ్బరిలో ఉన్నటువంటి తెల్లని స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో భగవంతున్నీ ఆరాధించాలి.ఇంకా చెప్పాలంటే కొబ్బరికాయ కుళ్ళింది అని ఏదో కీడు జరుగుతుంది అనుకోవడం పొరపాటు.

అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే( Spoiled Coconut ) మరొక కాయను కొట్టడం మంచిది.అలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని ఏదో శుభం జరుగుతుంది అని అనుకోవడం కూడా పొరపాటే అని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Coconut, Devotional, Pooja, Spoiled Coconut-Latest News - Telugu

బెల్లం, పెరుగు, కొబ్బరికాయ, ఉప్పు, బియ్యం మంచి శకునల కిందికి వస్తాయివీటిలో కొబ్బరికాయ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.ఏ యాత్రకైనా వెళ్లేటప్పుడు, వివాహ సమయాల్లో( Marriage ), యజ్ఞం, పూజలు మొదలగు కార్యక్రమాల్లో కొబ్బరికాయ విలువ అందరికీ తెలుస్తుంది.భారతీయ సాహితీ గ్రంధాల్లో దీని ప్రాముఖ్యతను గురించి వెల్లడించారు.కొన్ని ప్రాంతాల్లో రక్షాబంధన్ కార్యక్రమం జరిగే ముందు కొబ్బరికాయ పగలగొట్టి దాని ముక్కలను ఇతరులకు పంచి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఇంటి ముందు కూడా కొబ్బరి మొక్కలను పెంచడం ఆచారంగా వస్తూ ఉంది.క్షత్రియ జాతుల్లో పుత్రుడి తల దగ్గర కొబ్బరికాయను ఉంచే ఆచారం ఇప్పటికీ ఉంది.పుత్రుడు జన్మించగానే కొబ్బరికాయ పగలగొడతారు.మనిషి చనిపోయినప్పుడు కూడా కొన్ని జాతులలో పాడి తో పాటు కడతారని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube