పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) స్థాపించిన జనసేన పార్టీ( Janasena ) కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు నటుడు నాగబాబు ( Nagababu ).పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు పార్టీ వ్యవహారాలన్నింటిని కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్నారు.
అయితే కొందరు పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విషయాన్ని గుర్తించినటువంటి ఈయన పరోక్షంగా వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో లేనిపోని గొడవలు పెట్టుకొని పార్టీకి నష్టం తీసుకువచ్చే వారి పట్ల ఉపేక్షించేది లేదు అంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన టిడిపి శ్రేణులు అందరూ కూడా ప్రస్తుతం కలిసిపోయారు.జనసేన పార్టీ టిడిపితో పొత్తు కుదుర్చుకోవడంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఏకమయ్యారు కానీ కొంతమంది మాత్రం పార్టీ ముసుగులో ఉంటూ వేరే పార్టీలకు మంచి చేస్తూ సొంత పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ప్రవర్తిస్తున్నారు అలాంటివారిలో కళ్యాణ్ దిలీప్ సుంకర( Kalyan Dileep Sunkara ) కేడీఎస్ అనే వ్యక్తి కూడా ఒకరిని చెప్పాలి.కేడీఎస్ వృత్తిపరంగా లాయర్ అయినప్పటికీ ఆయన జనసేన కార్యకర్తగా ఎవరు కూడా తనని అంగీకరించలేదు కానీ ఆయనే జనసేన కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చేస్తూ పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తుంటారు.

ఇక ఈయనకు మహాసేన రాజేష్ తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి.వాటిని దిలీప్ సుంకర పార్టీకీ అంటించేసి రచ్చ చేస్తున్నారు.నిజానికి పవన్ కల్యాణ్… దిలీప్ సుంకరను ఎప్పుడూ చేరదీయలేదు కానీ దిలీప్ సుంకర మాత్రం జనసేన పార్టీని తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై నాగబాబు పరోక్షంగా ఈయనకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.ఇక ఈయనకు వైసిపి నేతలతో కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది.ఇలా వైసిపి పార్టీకి అనుకూలంగా ఉంటూ జనసేన పేరుతో జనసేన పార్టీకి నష్టం చేకూరిస్తే చూసి ఊరుకునేది లేదని ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించబోము అంటూ నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







