లింగోద్భవ మాఘమాసము కృష్ణపక్ష చతుర్దశి( Krishna Paksha Chaturdashi ) రోజు జరిగినట్లుగా శివపురాణము, లింగపురాణము తెలిపాయి.అలా శివుని యొక్క లింగోద్వృవం జరిగిన రాత్రిని మహాశివరాత్రిగా ఈశ్వరుని ఆరాధిస్తాము.
అయితే ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రులుగా పిలుస్తారు.అయితే శివుడికి చతుర్దశి తిథి చాలా ఇష్టమైనటువంటి తిథి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇక జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం చతుర్దశి తిథికి అధిపతి కేతువు అలాగే మోక్ష కారకుడైన కేతువు ఆధీనంలో ఉండడం వలన ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు.

అలాగే ఆ రోజున శివారాధన( Shiva worship ) లాంటివి చేయడం వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహము లభించి ఆరోగ్య సిద్ధి కలిగి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.అంతేకాకుండా మాస శివరాత్రి నాడు ఏ వ్యక్తి అయినా కూడా రాత్రి శివారాధన చేయడం మంచిది.మాస శివరాత్రి రోజు పంచామృతాలతో ఈశ్వరుని అభిషేకించాలి.
అలాగే బిల్వపత్రాలతో శివున్ని పూజించాలి.అంతేకాకుండా చెరుకు, తేనే, పళ్ళ రసాలతో( sugarcane, honey , juices ) ఈశ్వరుని అభిషేకించడం వలన అభీష్ట సిద్ధి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.
అంతేకాకుండా ఈశ్వరాభిషేకం చేసిన ప్రసాదాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పంచాలి.

ఇక మాస శివరాత్రి రోజు శివుని ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య సమయంలో పూజించాలి.అలాగే లింగోద్భావ సమయము అంటే అర్థరాత్రి 12 గంటల్లో ఈశ్వరుని ప్రత్యేకంగా పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.అలాగే మాస శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ లాంటివి ఆచరించడం వలన శివ అనుగ్రహం కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది.
అలాగే మాస శివరాత్రి రోజు శివాష్టకము, లింగాష్టకము, శివ అష్టోత్తర శతానామావళి లాంటివి పఠించడం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి.