హిందూమతంలో పూరి జగన్నాధుని రథయాత్ర( Purii Jagannath ) ఎంతో పవిత్రమైనది.అలాగే చాలా మంది ప్రజలు ఈ యాత్రను ఎంతో పుణ్యమైనదిగా భావిస్తారు.
పంచాంగం ప్రకారం జగన్నాథ యాత్ర ప్రతి ఏడాదిలో ఆషాడ మాసంలో శుక్లపక్షం రెండవ తేదీన జరుగుతుంది.ఈ సంవత్సరం పూరి జగన్నాథుడి రథయాత్ర జూన్ 20వ తేదీ మంగళవారం రోజున మొదలుకానుంది.
ఈ ప్రాంతంలో జగన్నాధుడు తన అన్న బలరాముడు( Balarama ), సోదరి సుభద్రతో కలిసి రథయాత్ర చేస్తాడు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ తీర్థయాత్రలో పాల్గొనే ఏ భక్తుడైన సరే అన్ని తీర్థ యాత్రల ఫలాలను పొందుతాడు.ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జగన్నాథుడు విష్ణు అవతారంగా భావిస్తారు.
అంగరంగ వైభవంగా జరిగే ఈ రథయాత్రను శ్రీ జగన్నాథ పూరి, పురుషోత్తమ పూరి, శంఖ క్షేత్రం, శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ యాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
పురాణాల ప్రకారం శ్రీ జగన్నాథుని సోదరి సుభద్ర( Subhadra ) ఒకసారి ఈ నగరాన్ని చూడాలని కోరికను వ్యక్తం చేసింది.

ఆ తర్వాత జగన్నాథుడు తన సోదరి,తన సోదరుడు బలభద్రుడి తో కలిసి రథం పై కూర్చుని నగరం అంతా చుట్టి చూపిస్తాడు.అప్పటినుంచి ఈ రథయాత్ర చేపట్టే సంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు.రథం నిర్మాణానికి వేప చెట్టు కలపను ఉపయోగిస్తారు.
ఈ కలప ఎంపిక కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు.ఈ కమిటీ ఎంపీక చేసిన చెట్ల కలపతో రథ నిర్మాణం చేస్తారు.
ఇంకా చెప్పాలంటే జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుడు 108 కుండలతో స్నానం చేస్తారు.అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే స్నానం చేయడానికి నీటిని తీసే బావి ఏడాదికి ఒకసారి మాత్రమే తెరవబడుతుంది.
అందుకే ఈ యాత్రను స్నాన్ యాత్ర అని కూడా పిలుస్తారు.ఈ యాత్ర తర్వాత భగవంతుడు 15 రోజులు తిరోగమనానికి వెళ్తాడు.