వారంలో రెండు రోజులు ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం పుష్కలంగా ఉంటుంది

మనకు అదృష్టం,డబ్బు కలిసి రావాలంటే మన పెద్దలు చెప్పిన కొన్ని ఆచారాలను ఆచరించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.ఆ ఆచారాలను పాటించటం వలన మనకు లాభాలే జరుగుతాయి.

 Lakshmi Kataksham Kalagalante Emi Cheyali-TeluguStop.com

అయితే కాస్త ఓపికతో చేయవలసి ఉంటుంది.ఇప్పుడు ఏమి చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుందో చూద్దాం.

ఉదయం లేవగానే ముందుగా కుడి అరచేతిని చూస్తే చాలా మంచిది.

ఉదయం లేవగానే ముందుగా వెనకాల తలుపు తీసి ఆ తరవాత ఇంటి ముఖద్వారం తెరవాలి.

ఈ విధంగా చేయటం వలన వెనక ద్వారం గుండా దారిద్ర దేవత బయటకు పోతుంది.అప్పుడు ముందు నుండి లక్ష్మి దేవి వస్తుంది.

ఇంటికి వచ్చినవారికి మంచినీటిని తప్పనిసరిగా ఇవ్వాలి.ఎవరైనా సుమంగళి వస్తే బొట్టు పెట్టాలి.

సుమంగళికి పసుపు,కుంకుమ ఇవ్వటం వలన మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం.

పూజాగదిలోకి వెళ్లే ముందుగా శుచిగా స్నానము చేసి శుభ్రంగా ఉండాలి.

పౌర్ణమి నాడు సాయంత్రం స్నానం చేసి పాలతో నైవేద్యం పెట్టి సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిది.

అన్నింటి కన్నా ముఖ్యమైనది….

లక్ష్మీ కటాక్షం కోసం మంగళ, శుక్రవారాల్లో అయిదు ముఖములు గల దీపపు కుందులలో అయిదు వత్తులను వేసి దీపపంను వెలిగిస్తే లక్ష్మి దేవి కటాక్షం కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube