ఎడమ చేతితో ఏ పనీ చేయవద్దా? నీటిని కూడా తాగొద్దా?

ఆలయానికి వెళ్లిన సమయంలో తీర్థం తీసుకునే సమయంలో, ప్రసాదం స్వీకరించే వేళ ఎడమ చేయి వాడొద్దని అంటారు.ఎడమ చేతితో బొట్టు పెట్టుకోవడం కూడా వద్దని వారిస్తారు పెద్దలు.

 Do Not Do Any Work With The Left Hand, Left Hand, Devotioanal , Water , Pooja, T-TeluguStop.com

ముఖ్యంగా పూజా కార్యక్రమాల సమయంలో ఎడమ చేతికి బదులుగా కుడి చేయినే వాడాలని అంటారు పండితులు.ఎడమ చేతిని వాడొద్దని ఎప్పుడూ చెబుతూ వస్తారు.

డబ్బులు ఇచ్చి పుచ్చుకునే సమయంలోనూ లెఫ్ట్ హ్యాండ్ వాడొద్దని అనడం తరచూ వినే ఉంటాం.

శాస్త్రాలు కూడా ఎడమ చేతిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వాడొద్దని చెబుతున్నాయి.

భోజన సమయంలో కుడి చేతి మణికట్టుపై పాత్రను ఆనించి ఎడమ చేతిలో పట్టుకుని నీటిని తాగాలని సూచిస్తున్నాయి.ఎడమ చేతితో వడ్డించినా వచ్చేది పాపమేనని అంటున్నాయి శాస్త్రాలు.

ఈ విధంగా తినే భోజనం రాక్షస భోజనం అవుతుందని పండితులూ సైతం చెబుతున్నారు.దానం కూడా ఎడమ చేతితో అస్సలే చేయకూడదని సూచిస్తున్నాయి.

ఎడమ చేతితో ఎంత గొప్ప కార్యం చేసినా.అనారోగ్యకరమేనని పలు శాస్త్రాలు ఉంటున్నాయి.

కుడి చేతితో ఏ పని చేసినా ఆరోగ్యమని, ఎడమ చేతితో చేసిన ప్రతి పనీ అనారోగ్యమని అంటున్నారు పెద్దలు.కానీ పూజా కార్యక్రమాలు చేసే సమయంలో కుడి చేతికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో అదే స్థాయిలో ఎడమ చేతికీ కూడా ఇవ్వాలని మరి కొన్ని శాస్త్రాల్లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube