ఆర్జీవీని పటాయించే క్రమంలో వంశీ నాపై కుట్రలు చేశాడు- జేడీ చక్రవర్తి

రామ్ గోపాల్ వర్మతో తన జర్నీ చాలా సుదీర్ఘమైనది అని చెప్పాడు నటుడు జేడీ చక్రవర్తి.ఆయనతో కలిసి 36 సినిమాలు చేసినట్లు వెల్లడించాడు.

 Jd Chakravarthi About Krishna Vamsi , Jd Chakravarthi, Krishna Vamsi , Ramgopalv-TeluguStop.com

అయితే తాను ఏనాడూ ఆయన సినిమాల్లో అవకాశం ఇవ్వాలని అడగలేదని చెప్పాడు.ఆయన సినిమాల్లోని క్యారెక్టర్ కు నేను సరిపోతాను అనుకుంటే తీసుకునేవాడని చెప్పాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

అటు సరసాలు చాలా శ్రీవారు నీకు అనే పాట తీస్తున్నసమయంలో తాను హెడ్డింగ్ బుక్ రాస్తున్నట్లు చెప్పాడు.

ఆ సమయంలో వంశీ వచ్చి ఎందుకండీ మీకు ఇవన్నీ.హాయిగా ఉండలేరా? ముఖానికి మేకప్ వేసుకుని నాలుగు డైలాగులు చెప్పి, డబ్బులు తీసుకుని హాయిగా ఉండొచ్చు కదా అన్నాడట.అయితే తప్పేముందండీ.ఒక వ్యక్తిలో రెండు టాలెంట్లు ఉండకూడదా? అని చెప్పానన్నాడు.అప్పట్లో తమ ప్రయత్నాలన్నీ ఆర్జీవీని మచ్చిక చేసుకోవడానికే ఉండేవని చెప్పాడు.అదే సమయంలో తన చేతిలోని బుక్ లాక్కునేందుకు వంశీ ప్రయత్నించినట్లు చెప్పాడు.దాంతో తనకు కోపం వచ్చి పరుష పదాలు వాడినట్లు చెప్పాడు జేడీ.అప్పుడే తన మిత్రుడు వచ్చి వారించినట్లు చెప్పాడు.

ఆ తర్వాత వంశీకి నాతో పెట్టుకోవద్దని సర్థి చెప్పినట్లు వెల్లడించాడు.అప్పటి నుంచి వంశీతో మనస్పర్దలు ఏర్పడినట్లు చెప్పాడు.

Telugu Jd Chakravarthy, Jd Chakravarthi, Jdchakravarthi, Krishna Vamsi, Ramgopal

ఆ తర్వాత తనను ఎక్కడ అవకాశ దొరికితే అక్కడ తొక్కేసేందుకు వంశీ ప్రయత్నించేవాడని చెప్పాడు.ఒక సీన్ లో మిక్సీ పెట్టాలి.తనను పెట్టమని వంశీ చెప్పాడు.అప్పుడే సీన్ లోకి ఆర్జీవీ వచ్చాడు.అక్కడ మిక్సీ ఉండాలి కదా అన్నాడు.వంశీ వెంటనే.

జేడీకి చెప్పాను పెట్టలేదు.ఆయనకు ఎప్పుడూ హీరోయిన్లతో మాట్లాడాలి అనే యావ తప్ప పని చేయాలని యావ లేదని తన గురించి బ్యాడ్ గా చెప్పాడని వెల్లడించాడు.

నిజానికి మిక్సీ అప్పటికే రాకపోవడం వల్ల తాను అక్కడ పెట్టలేదన్నాడు.ఆ విషయాన్ని దాచి తనను ఆర్జీవీ ముందు నెగెటివ్ గా చూపించేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు.

అప్పటి నుంచి తనతో ఓరేంజిలో కోపంగా ఉండేదని వెళ్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube