డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Dried Fruit Health Benefits

సాంప్రదాయకంగా డ్రై ఫ్రూట్స్ ఎండబెట్టిన విధానం ద్వారా లేదా గాలి సొరంగంలో గాని ఎండబెట్టి తయారుచేస్తారు.తాజా పండ్లలో నీటిని తొలగించటం ద్వారా డ్రై ఫ్రూట్స్ ని తయారుచేస్తారు.

 Dried Fruit Health Benefits-TeluguStop.com

తాజా పండ్లు నిర్జలీకరణము జరిగి అవసరమైన పోషకాలు కొన్ని ఎక్కువ గాఢముగా మారటం వలన పండు లుక్ కూడా మారుతుంది.డ్రై ఫ్రూట్స్ లో శక్తి మరియు ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన ఫీట్ నెస్ నిపుణులు ఎక్కువగా వ్యాయామం ముందు సత్తువ అందించడానికి సిఫార్స్ చేస్తారు.

డ్రై ఫ్రూట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

 Dried Fruit Health Benefits-Dried Fruit Health Benefits-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

1.యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది

ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఒక ఎండు ఆపిల్ మరియు ఆప్రికాట్లు తింటే క్యాన్సర్ ని నిరోదిస్తుంది.యాపిల్స్ మరియు ఆప్రికాట్లలో ఫోటో న్యూ త్రియంత్స్, యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన క్యాన్సర్ కారకాలను తరిమి కొడతాయి.అంతేకాక వీటిలో విటమిన్ ఎ, సి మరియు ఐరన్ సమృద్దిగా ఉంటాయి.

2.అందమైన,ఆరోగ్యకరమైన చర్మం

రోగనిరోధక వ్యవస్థ బాగుంటే చర్మం తాజాగా మరియు నిగనిగలాడుతూ ఉంటుంది.పండ్లలో రాజైన మామిడి పండులో జుట్టు పెరుగుదలలో సహాయం చేయటానికి పిండి పదార్ధాలు సమృద్దిగా ఉంటాయి.

అయితే డ్రై మామిడిలో ఫోటో న్యూ త్రియంత్స్, విటమిన్లు ఎ, సి మరియు E,ఒమేగా 3 మరియు 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.ఇవిఆరోగ్యకరమైన చర్మం మరియు రోగనిరోధక ఆరోగ్యానికి చాలా అవసరం.

3.కీలకమైన పొటాషియం

తాజా ఆప్రికాట్లు మరియు రేగులో పొటాషియం సమృద్ధిగా ఉన్నప్పటికీ, పొడి ఆప్రికాట్లు మరియు ప్రూనేలో పొటాషియం చాలా అధిక మొత్తంలో ఉంటుంది.సోడియం + పొటాషియం కణాంతర మరియు వెలుపల నీటి మట్టాల సంతులనంను నియంత్రిస్తాయి.పొటాషియం రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4.ఫైబర్ సమృద్దిగా

జీర్ణశక్తి, మలబద్ధకంలను నిరోదించటానికి ఫైబర్ సహాయపడుతుంది.

చెర్రీ మరియు అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలనరోజువారీ ఆహారంలో చేర్చాలి.చెర్రీని “యాంటిఆక్సిడెంట్ సూపర్ పండు” అని అంటారు.

ఈ పండులో యాంటిఆక్సిడెంట్ అధిక స్థాయిలోనూ, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ మరియు ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు అదనంగా ఉంటాయి.అంజీర్ లో ఇనుము, ఫోలిక్ ఆమ్లం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.

5.శరీరంలో ఐరన్ కంటెంట్ ని పెంచుతుందిడ్రై ప్రూనే మరియు ఆప్రికాట్లలో ఇనుము సమృద్దిగా ఉంటుంది.

ప్రూనే మరియు అప్రికాట్ లో ఉండే ఐరన్ రక్త హీనతను నివారించటంలో సహాయపడుతుంది.ఎండుద్రాక్షలో కూడా పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం మరియు ఇనుము సమృద్దిగా ఉండి రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube