పెసలతో వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే పింపుల్స్ మళ్లీ ఈ వంక కూడా చూడవు!

పెసలు( Green moong dal ).ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పప్పు దినుసుల్లో ఒకటి.

 Green Moong Dal Helps To Get Acne Free Skin! Green Moong Dal, Acne Free Skin, Ac-TeluguStop.com

ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి6 వంటి పోషకాలకు పెసలు గొప్ప మూలం.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా పెసలు ఉపయోగపడతాయి.

పురాతన కాలం నుండి పెసలను ఒక సౌందర్య ఉత్పత్తిగా వాడుతున్నారు.ముఖ్యంగా మొటిమల్లేని మెరిసే అందమైన చర్మాన్ని పొందడానికి పెసలు చాలా బాగా సహాయపడతాయి.

మొటిమల కారణంగా మనలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.మొటిమలకు( acne ) దూరంగా ఉండడం కోసం బలంగా ప్రయత్నిస్తుంటారు.అయితే వారానికి మూడు సార్లు పెసలతో ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే పింపుల్స్ మీ వంక కూడా చూడవు.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసలు వేసి వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఆపై పెసలు మునిగేలా వాటర్ పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Clear Skin, Greenmoong, Latest, Pimples, Skin Care

మరుసటి రోజు ఉదయం మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసలు వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి( ghee ) వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌దిహేను నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకున్న అనంతరం సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Acne, Acne Skin, Tips, Clear Skin, Greenmoong, Latest, Pimples, Skin Care

వారానికి మూడు సార్లు ఈ రెమెడీని పాటిస్తే అదిరిపోయే లాభాలను పొందుతారు.ఈ రెమెడీ మీ చర్మ రంధ్రాలను నూనెలు లేదా ధూళితో మూసుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.అలాగే చర్మం మరియు చర్మ రంధ్రాల నుండి మలినాలను తొలగించి మొటిమలకు అడ్డుకట్ట వేస్తుంది.మొటిమలు రాకుండా నిరోధిస్తుంది.అదే స‌మ‌యంలో మీ స్కిన్ ను తాజాగా మరియు యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube