మనం ప్రతి రోజు ఎన్నో వస్తువులను వాడి పడేస్తూ ఉంటాం.ఏదైనా ఒక వస్తువును పూర్తిగా వినియోగించుకుని, దాన్ని అవతల పడేసిన తర్వాత దాని ఉపయోగం ఇంకా ఉందని తెలిస్తే ఎలా అనిపిస్తుంది, అయ్యో దాన్ని ఇంకా వాడుకోమైతిమి కదా అనుకుంటూ ఉంటారు.
అంటే ఫుల్ బాటిల్ తాగిన వ్యక్తి లక్కీ డ్రాప్ అంటూ తాగేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.అలాగే ఒక వస్తువును పూర్తిగా వాడేసి, ఆ తర్వాత కూడా దాన్ని మరో రకంగా వాడుకుంటే ఆ ఆనందం వేరేగా ఉంటుంది.
ఉదాహరణకు ఒక పెన్నును పూర్తిగా వాడేసుకుని ఆ పెన్ను పడేయకుండా, దాని క్యాప్ ను బట్టలు ఆరేసినప్పుడు క్లిప్‌గా వాడుకుంటే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించిండి.అలా ఈ ఆరు వస్తువులు మీరు పనికి రావని వదిలేస్తూ ఉంటారు.
కాని వాటి వల్ల కూడా ఉపయోగం ఉంది.

ఆ ఆరు వస్తువులు ఏంటీ, వాటిని రీ యూజ్ ఎలా చేసుకోవాలనే విషయం ఇప్పుడు చూద్దాం
.
పెన్ను క్యాప్స్ : పెన్నులను ఎంతో మంది వాడేసి, అందులో ఇంక్ పూర్తి అవ్వగానే పడేస్తారు.అయితే పెన్నులు పడేసి, వాటి క్యాప్‌లను దండేలకు క్లిప్‌గా వాడితే బాగుంటుంది.
దండెంపై బట్టలు ఆరేసిన సమయంలో అవి కింద పడకుండా క్లిప్స్ మాదిరిగా వాటిని ఉపయోగించొచ్చు.

దోమల మేట్లు
: దోమల మేట్లను వాడేసిన తర్వాత వాటిని పడేస్తారు.కాని వాటిని ఒక నిమిషం నీటిలో ఉంచి, బయటకు తీసి ఆరబెట్టి మళ్లీ వాడవచ్చు.దోమల మేట్లను ఇలా రెండు మూడు సార్లు వినియోగించొచ్చు.

చిన్న పెన్సిల్లు
: చేతిలో పట్టుకోలేనంతగా పెన్సిల్ చిన్నగా అయిన సందర్బంలో వాటిని పడేస్తూ ఉంటారు.కాని వాటిని వృత్త లేఖినిలో పెట్టి మరి కొన్ని రోజులు వాడుకోవచ్చు.

పాలకవర్
: పాల పాకెట్స్ రోజు మనం చెత్త బుట్టలో వేస్తూ ఉంటాం.కాని పాలు గిన్నెలో పోసిన తర్వాత పూర్తిగా కట్ చేసి, కవర్ రివర్స్ చేసి మెడపై, గొంతు వద్ద, చేతులపై రుద్దుకుంటే చర్మం స్మూత్ అవ్వడంతో పాటు తెల్లగా అవుతుంది.

టూత్ పేట్ ట్యూబ్ : ఏదైనా టూత్ పేస్ట్ ట్యూబ్ పూర్తి అయినప్పుడు దాన్ని పారేయకుండా, దాంట్లోకి గాలి ఉంది, దానిలో సగం వరకు నీటిని నింపి, రెండు మూడు రోజుల పాటు ఆ నీటిని మౌత్ ఫ్రెష్నర్గా వాడుకోవచ్చు.
ఉల్లిపాయ పొట్టు
: ఉల్లిపాయలు కోసేప్పుడు పొట్టును తీసి పక్కకు పడేస్తారు.కాని ఆ పొట్టును వేడి నీటిలో కొద్ది సమయం ఉంచి, ఆ నీటిని స్నానం చేస్తే జుట్టు మంచి నిగారింపు పొందుతుంది.చర్మం కూడా పలు సమస్యలకు దూరం అవుతుంది.
