మన భారత దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి.మన దేశంలో ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలివచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.
అలాగే మరి కొంతమంది భక్తులు స్వామి వారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంభుగా వెలసిన రెండు వినాయక పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.
అందులో మొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకం దేవాలయం( Kanipakam Temple ) కాగా, రెండవది అనకాపల్లి జిల్లా చోడవరం దేవాలయం( Chodavaram ) అని దాదాపు చాలామందికి తెలుసు ఈ దేవాలయంలో తాజాగా వినాయక చవితి ఉత్సవాలు ( Ganesh Chaturthi )కన్నుల పండుగ ముగిసాయి.

అయితే రోజుకో అలంకరణతో దర్శనం ఇచ్చిన స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు.అలాగే చివరి రోజు తమలపాకులతో విశేషా అలంకరణలో భక్తులకు కార్యసిద్ధి గణపతిగా దర్శనమిచ్చారు.పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో మరో విశేషం కూడా ఉంది.
ఆ విశేషం ఏమిటంటే వినాయకుడి తొండం భూమి లోపలికి చొచ్చుకోని ఉంటుంది.అందుకే అక్కడ నుంచి పూర్వం తరలించాలని అనుకున్నా విగ్రహం కదల్లేదని ప్రధాన అర్చకులు చెబుతున్నారు.
అయితే స్వామి వారికి రెండవ రోజు సింధూర అలంకరణ, మూడవ రోజు చందన అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చారు.

అలాగే నాలుగో రోజు భస్మ అలంకరణ, ఐదవ రోజు కుంకుమ అలంకరణ, ఆరవ రోజు పసుపు అలంకరణ, ఏడవ రోజు చందన అలంకరణ ఎనిమిదో రోజు పసుపు కుంకుమ అలంకరణ 9వ రోజు భస్మ సహిత చందన అలంకరణలలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు.ఆ తర్వాతి రోజు సాయంత్రం స్వయంభు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు సందర్భంగా పత్ర పుష్ప ఫలా విశేషాలంకరణ నిర్వహించారు.భక్తులకు కార్యసిద్ధి గణపతిగా స్వామి వారు దర్శనమిచ్చారు.