కొన్ని కొన్ని సార్లు అదృష్టం కొద్దీ కొన్ని కళా ఖండాలను మన హీరోలు మిస్ అవుతూ ఉంటారు.పొరపాటుగా ఆ కళా ఖండాలు చేసి ఉంటే పాపం అసలు కెరీర్ ఉండేది కాదు.
ఇలాంటి సంఘటనలు గతం లో చాలానే జరిగాయి.ఇప్పుడు రీసెంట్ గా ‘పెదకాపు-1′( Peddha Kapu-1 ) సినిమా విషయం లో అది రిపీట్ అయ్యింది.
విభిన్నమైన అభిరుచి గల దర్శకులలో ఒకడైన శ్రీకాంత్ అడ్డాల, తన కెరీర్ ప్రారంభం లో ఎంత వేగంగా అయితే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడో, అంతే వేగంగా క్రిందకి పడిపోయాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయిన శ్రీకాంత్ అడ్డాల , మళ్ళీ ఇన్నాళ్లకు పెద్ద కాపు చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.
రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఫలితంగా సెలవు దినాలు పెట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.అయితే ఈ సినిమాని ముందుగా కొత్త హీరో తో కాకుండా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తో చెయ్యాలని అనుకున్నారట.ఆయన యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష’ చిత్రాన్ని ఓకే చేసేముందు ఎన్నో సబ్జక్ట్స్ ని విన్నాడు.
అందులో ఈ ‘పెద్ద కాపు’ కూడా ఒకటి.కథ బాగానే ఉంది కానీ, ఎక్కడో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, కొద్దీ రోజులు ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టండి.
భవిష్యత్తులో ఏదైనా ఛాన్స్ ఉంటే చేద్దాం అని అన్నాడట.కానీ శ్రీకాంత్ అడ్డాల అన్ని రోజులు ఎదురు చూసే ఓపిక లేక విరాట్ కర్ణ అనే కొత్త హీరో ని పెట్టి చేసారు.
ఫలితం ఈరోజు మనమంతా చూస్తూనే ఉన్నాం.

‘విరూపాక్ష'( Virupaksha ) చిత్రానికి బదులుగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాని చేసి ఉంటే ఆయన కెరీర్ లో కోలుకోలేని దెబ్బ తినేవాడు, జస్ట్ మిస్ అయ్యింది.ఇక శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే ఈయనతో చిన్న హీరోలు కూడా సినిమాలు తియ్యడం కష్టమే ఇక.ఇండస్ట్రీ ని వదిలి వెళ్లి వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటే బెటర్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు.లేకపోతే ఇలాగే కొత్తవాళ్లతో సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం తప్ప ఆయనకీ మరో మార్గం లేదని అంటున్నారు.చూడాలి మరి శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది.