భద్రాచల శ్రీరాముని తలంబ్రాలకు 80 క్వింటాళ్ల బియ్యం పంపిణీ...

ప్రముఖ పుణ్య క్షేత్రమైన భద్రాచలంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం లో తలంబ్రాల బియ్యం కోసం జంగా రెడ్డి గూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి నుంచి ఆదివారం 80 క్వింటాళ్ల బియ్యం పంపుతున్నట్లు సమితి అధ్యక్షుడు ముళ్ళపూడి వీర వెంకటన్న సత్యనారాయణ వెల్లడించారు.జంగా రెడ్డి గూడెం నుంచి భద్రాద్రి కల్యాణానికి తలంబ్రాల బియ్యం ఆదివారం పంపినట్లు వెల్లడించారు.

 Distribution Of 80 Quintals Of Rice To Talambras Of Bhadrachalam Srirama , Bhadr-TeluguStop.com

అంతే కాకుండా సమితి ప్రతి నిధులు సీతా రాములకు పూజాదికాలు నిర్వహించిన తర్వాత 20 క్వింటాళ్ల బియ్యం పంపే వాహనానికి పూజ చేసి జై శ్రీరామ్ నామ స్మరణ చేస్తూ కొబ్బరికాయలు కొట్టి వాహనాన్ని ముందుకు పంపారు.సత్యనారాయణ మాట్లాడుతూ భద్రాది కల్యాణం తర్వాత తలంబ్రాల బియ్యం ఎంతో పవిత్రంగా భక్తులు శిరస్సును ధరిస్తారని వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే భక్తుల కు పంపిణీ చేసేందుకు 150 క్వింటాళ్ల బియ్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించిందని రైతులు, భక్తుల నుంచి సేకరించిన బియ్యం శ్రీ రామ ఆధ్యాత్మిక సేవా సమితి నుంచి పంపుతున్నామని శ్రీ రామ నవమికి గోటితో వలిచిన తలంబ్రాల తో జంగా రెడ్డి గూడెం రామాలయం నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ఇంకా ఎవరికైనా తలంబ్రాల కోసం బియ్యం కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్ 9441918489 కు సంప్రదించాలని వెల్లడించారు.అంతే కాకుండా దాకారపు గోపాల కృష్ణ,ఆళ్ల రమేష్‌, మద్ది పాటి రాంపండు, తెల్ల మేకల రామ కృష్ణ,పొదిలి సూర్య చిరంజీవి,జెట్టి భీమ శేఖర్‌, గౌర్ని ప్రసాద్, కొల్లూరి శ్రీనివాస్, పాతూరి పాపారావు, కానూరు సత్తి బాబు, మనుకొండ వెంకట రెడ్డి, తదితరులు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతేకాకుండా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వీరందరూ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube