పొడుగు జుట్టు అమ్మాయిలను ఇష్టపడని వారు ఉండనే ఉండరు. జుట్టు పొడుగ్గా( Long Hair ) ఉంటే మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు.
అందుకే చాలా మంది అమ్మాయిలు తమ జుట్టును పొడుగ్గా పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎంత పొట్టి జుట్టు అయినా సరే మూడు నెలల్లో పొడుగ్గా మారుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఉల్లిపాయ తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు బిర్యానీ ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి( Curry Leaves Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పొడి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి వేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న వాటర్ ను సరిపడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత పొట్టిగా ఉన్నా కూడా కొద్దిరోజుల్లోనే పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ రెమెడీతో హెయిర్ ఫాల్( Hairfall ) దూరం అవుతుంది.
జుట్టు తరచూ డ్రై అవ్వకుండా ఉంటుంది.కురులు హెల్తీగా, షైనీ గా మెరుస్తాయి.
కాబట్టి పొడవాటి జుట్టును కోరుకునేవారు, హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







