చలికాలంలో జలుబు, దగ్గు నుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం..!

చలికాలం( winter ) మొదలైంది అంటే చాలు ఇన్ఫెక్షన్లకు దారితీస్తూ ఉంది.ఎవరు కూడా జలుబు, దగ్గు( Cold, cough ) లాంటి సమస్యలతో బాధపడుతూనే ఉంటారు.

 Are You Suffering From Cold And Cough In Winter Immediate Relief With These Tips-TeluguStop.com

ఒకసారి దీంట్లోకి ఎంటర్ అయిందంటే అసలు బయటకు వెళ్లడం చాలా కష్టం.అలాగే దీని కోసం కెమికల్స్ తో కూడిన టాబ్లెట్లను వాడలేము.

ఎందుకంటే మందులు ఎంత వాడినా కూడా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది తప్ప పూర్తిగా నివారించడం కుదరదు.అందుకే ఇప్పుడు సులభంగా జలుబు, దగ్గు లాంటి సమస్యలను ఇంటివద్దనే తగ్గించుకునేందుకు అసలైన మార్గం తెలుసుకుందాం.

Telugu Ashwagandha, Basil, Cinnamon, Cough, Ginger, Tips, Lemon, Pepper, Turmeri

మనం వంటింట్లో ఎప్పుడు రెడీగా ఉండే అల్లం, మిరియాలు, లవంగాలు, పసుపు ( Ginger, pepper, cloves, turmeric )లాంటివి ఈరోజు మనం వాడడం వలన దగ్గు, జలుబు లాంటి ఎన్నో రెస్పిరేటరీ సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.మనం రోజు తీసుకునే టీలో ఒక చిన్న ముక్క అల్లం చేర్చుకోవడం వలన పలు రకాల ఇన్ఫెక్షన్లను దూరం పెట్టుకోవచ్చు.అలాగే ప్రతి ఇంట్లో ఉండే తులసి చెట్టు ఆకులు రోజుకు నాలుగు ఐదు నేరుగా నమలడం వలన శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.రోజు టీకి బదులుగా గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే తులసి, అశ్వగంధ, దాల్చిన చెక్క, లెమన్ జింజర్ ఇలా ఎన్నో రకాల ఫ్లేవర్స్ లను టీ లో వేసుకొని తాగడం మంచిది.

వీటిలో ఏదైనా ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్ దూరం చేస్తాయి.

Telugu Ashwagandha, Basil, Cinnamon, Cough, Ginger, Tips, Lemon, Pepper, Turmeri

ఇక రోజు పాలు తాగే అలవాటు ఉంటే, అందులో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మంచిది.పసుపులో ఉండే సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ అలాగే ఫంగల్ లక్షణాలు గొంతు నొప్పి తగ్గించడంతోపాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.చలికాలం తగ్గెంత వరకు గోరువెచ్చని నీటిని తాగాలి.

ఇలా చేయడం వలన జలుబు వచ్చే ఆస్కారం కూడా తగ్గుతుంది.ఇక మొండు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే దాల్చిన చెక్క పొడిలో తేనె కలుపుకొని రోజు రెండుసార్లు తీసుకోవాలి.

అలాగే వీలైనంతవరకూ ఆవిరి పడుతూ ఉండాలి.దీంతో మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube