సూపర్ స్టార్ కృష్ణ, క్యూట్ యాక్ట్రెస్ వాణిశ్రీ కలిసి చాలా సినిమాలు చేశారు.వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసేందుకు అప్పట్లో థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తే వారు.
వాణిశ్రీ( Vanisri ) తెలుగులో వందలకు పైగా సినిమాల్లో నటించింది.చివరిసారిగా భద్రాద్రి రాముడు (2004)( Bhadradri Ramudu ) మూవీలో కనిపించింది.
కెరీర్ చివరి అంకంలో ఈ ముద్దుగుమ్మ అత్త, పిన్ని క్యారెక్టర్లు చేస్తూ ఆకట్టుకుంది.సినిమాలకు దూరమైన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఎన్నో వెల్లడించింది.
అంతేకాదు తనతో చాలా సినిమాలు చేసిన కృష్ణతో( Hero Krishna ) ఉన్న అనుబంధం గురించి పంచుకుంది.వారి మధ్య కెరీర్ పరంగా చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించింది.
ఒకానొక సమయంలో కృష్ణ తనకు ఫోన్ చేసి తన తల్లిగా నటించాలని( Mother Role ) కూడా అడిగినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.దానికి సంబంధించిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో వాణిశ్రీ మాట్లాడుతూ.“30 ఏళ్ల తర్వాత కృష్ణ నాకు ఫోన్ చేశారు.వాణిశ్రీ ఆ సినిమాను చేస్తే నువ్వు నాకు తల్లిగా నటించాల్సి ఉంటుంది.నీకు నేను కొడుకు వేషం వేయాలి.
ప్రొడ్యూసర్( Producer ) నిన్ను తల్లిగా పెట్టి తీయాలనుకుంటున్నారు.ఆ వేషం వేస్తావా మరి అని అడిగారు.
దాంతో మీకు అమ్మగా నేను నటించాలా? అని బాగా షాక్ అయ్యాను.అసలు ఏం రోల్ అది అని కూడా అడిగాను.ఒకసారి క్యాసెట్ పంపించండి సినిమా చూస్తాను అని అన్నాను…”
“థియేటర్లోనే ఆ సినిమా చూసేందుకు ఆరేంజ్మెంట్స్ చేశారు.ఆ మూవీ చూశాక చాలా బాధేసింది.తమిళంలో ఆమె ఎవరో ఒక నటి విషం పెట్టి చంపే పాత్ర చేసింది.అలాంటి పాత్ర చేయాలని నాకు అనిపించలేదు.అందుకే చేయాలంటే చేయను అన్నాను.రెండు మూడు సార్లు ఫోన్ చేసినా అలాంటి సమాధానం చెప్పాను.ఆ తర్వాత మళ్లీ నాకు ఫోన్ చేయలేదు.” అని చెప్పుకొచ్చింది.ఆ సినిమా ఏంటి ఆ పాత్ర ఎవరు చేశారు అనే వివరాలు ఆమె వెల్లడించలేదు కానీ రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటున్నారు.వాణిశ్రీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తే చూడాలని ఉందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.