దేవభూమి ప్రాంతమైన అల్మోరా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది.ఈ ప్రాంతానికి చరిత్ర చాలా పురాతనమైనది అక్కడ ఎన్నో అనేక దేవాలయాలు ఉన్నాయి.
అయితే అల్మోరా నుండి దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆలయం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.మా సయాహీ దేవి ఆలయం( Ma syahi devi )ఈ ఆలయం పర్వత శిఖరం పై ఉంది.
అక్కడ ఉన్న ప్రజల ప్రకారం ఈ ఆలయాన్ని ఒకే ఒక రాత్రిలో నిర్మించారు.ఆ దేవాలయం చుట్టంతా దట్టమైన అడవి ప్రాంతం ఉండడం వలన ఇంతకుముందు ఇక్కడ సింహాలు, పులులు కూడా కనిపించేవట.
అలాగే అమ్మవారు రోజుకి మూడుసార్లు చొప్పున రంగులు మారుతుందని భక్తులు చెప్పారు.సూర్యోదయం సమయంలో అమ్మవారు బంగారు వర్ణంలో, ఇక పగటిపూట నల్లగా, సాయంత్రం ముదురు రంగులో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని అక్కడి భక్తులు తెలిపారు.అయితే నిజమైన హృదయంతో ఆ గుడికి వచ్చిన ఏ భక్తుడైన కూడా ఈ విషయాలను అక్కడ చూడవచ్చు.ఈ ఆలయంలో అమ్మవారి తో పాటు గణేశుడి విగ్రహం( Ganesha ) కూడా ఉంది.
ఇవి 1254 సంవత్సరానికి చెందిన విగ్రహాలని అక్కడి ప్రజలు చెబుతుంటారు.అంతేకాకుండా ఈ ఆలయంలో భైరవుడు, హనుమాన్ ( Hanuman ) మొదలైన విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి.
ఆ ఆలయం పురాతనమైనదని అక్కడి పూజారి జీవన్ నాథ్ గోస్వామి తెలిపారు.ఆ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో నిర్మించారని ఆయన తెలిపారు.
వినాయకుని విగ్రహం నుంచే ఈ ఆలయ చరిత్రను గుర్తించవచ్చని చెప్పారు.అదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు.
అయితే ఎవరైతే నిజమైన హృదయంతో వస్తారో వారి ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని, కోరికలు నెరవేరునప్పుడు ప్రజలు గంటను కట్టడం లేదా భండార మొదలైన వాటిని నిర్వహిస్తారు.