కొన్ని సంవత్సరాల క్రితం బాత్రూంలు ఇంటి బయట ఉండేవి.దీంతో ఇంటి కుటుంబ సభ్యులకు కాస్త సౌకరంగా ఉండేది.
ప్రస్తుతం అటాచ్డు బాత్రూం లు వచ్చాయి.ఇంట్లోనే టాయిలెట్ బాత్రూం ఉండడంతో కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్న అందరూ దాని వైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో వీటితో వాస్తు సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.మారుతున్న జీవనశైలితో ఇంట్లో అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో అటాచ్డ్ బాత్ రూమ్ నిర్మించుకుంటూ ఉన్నారు.
దీని వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న సౌకర్యంగానే ఉంటుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బాత్రూం విషయంలో వాస్తు నియమాలు కచ్చితంగా పాటించాలి.
లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులు తప్పవు.వాస్తు నియమాలు పాటించకపోతే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బాత్రూం వినియోగంలో ఉండే దోషాలు వల్ల మన ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.డబ్బు వృధా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పేదరికం దరి చేరుతుంది.అటాచ్డ్ బాత్రూం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది.

ముఖ్యంగా బాత్రూం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి.అటాచ్డ్ బాత్రూంలో ఎప్పుడూ కూడా లోపల పగిలిపోయిన వస్తువులు ఉంచకూడదు.కుళాయి లీక్ కాకుండా చూసుకోవాలి.అలా ఉంటే ధన నష్టం జరుగుతుంది.బాత్రూం లో చెత్తాచెదారం ఉంటే మన జీవితంపై పెను ప్రభావం పడుతుంది.బాత్రూం వాస్తు దోషాలు తొలగించేందుకు చిన్న గిన్నెలో నిండ ఉప్పు పోసి ఆ ఉప్పును బాత్రూంలో ఉంచాలి.

ఇలా ప్రతివారం ఆ ఉప్పును బయటపడేసి మళ్ళీ కొత్త ఉప్పును మార్చాలి.ఇలా చేయడం వల్ల వాస్తు దూరం అయిపోతాయి.బాత్రూం గోడలకు ఎట్టి పరిస్థితులలోనూ నలుపు లేదా గోధుమ రంగును వేయకూడదు.ఇలాంటి చిన్న చిన్న వాసు చిట్కాలను ఉపయోగించి వాస్తు దోషాలను దూరం చేసుకోవచ్చు.