కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రతి రోజు చాలామంది శ్రీవారి భక్తులు తరలివస్తూ ఉంటారు.వారంతరాల్లో, సెలవు రోజులలో భక్తుల సంఖ్య మరింత అధికం అవుతుందనే సంగతి కూడా చాలామందికి తెలుసు.
దీని వల్ల సెలవు రోజులలో, ప్రత్యేక రోజులలో స్వామివారి దర్శనం భాగ్యం కోసం వెంకటేశ్వర స్వామి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండవలసి వచ్చింది.అయినప్పటికీ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, క్రమశిక్షణతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి, తమకు ఎంతో ఇష్టమైన ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఫిబ్రవరిలో స్వామి వారిని ఎంత మంచి భక్తులు దర్శించుకున్నారు అనే వివరాలను టిటిడి బోర్డు ప్రకటించింది.
ఫిబ్రవరి నెలలో దాదాపు 18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా 114 కోట్ల ఆదాయం వచ్చింది.దాదాపు 92.96 లక్షలు లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.అదే సమయంలో7.21 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు.దాదాపు 34 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిది.
అంతే కాకుండా తిరుమల లో సాలకట్ల తెప్పోత్సవాలు ఎంతో ఘనంగా మొదలయ్యాయి.శ్రీవారి పుష్కరిణిలో మొదటి రోజు సీత సమేత శ్రీరామ చంద్ర మూర్తి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వార్లను తెప్పలపై ఒరేగించారు.పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఇచ్చారు.పుష్కరిణిలో శ్రీవారి తెప్ప విద్యుత్ అలంకరణ ఆకట్టుకుంది.పుష్కరిణిలో గోవింద నామస్మరణంతో మార్మోగింది.తెప్పోత్సవాల కారణంగా శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా, తోమాల సేవ, అర్చన సేవలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.