మనీ ప్లాంట్ నాటేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల మొక్కలను ఇంటిలో పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.  ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పనిసరిగా మనీప్లాంట్ మనకు కనబడుతుంది.

 Rules To Follow While Planting A Money Plant Details,  Money Plant, Houses, Plan-TeluguStop.com

ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఎంతో శుభసూచకమని ఈ ప్లాంట్ ఉండటం వల్ల ఏ విధమైనటు వంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని చాలా మంది భావిస్తారు.ఈ క్రమంలోనే మనీ ప్లాంట్ ప్రతి ఒక్కరూ నాటుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు.

అయితే ఈ మనీ ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు.ఈ చెట్లు నాటే సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి.

మరి ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

మనీ ప్లాంట్ నాటేటప్పుడు చాలామంది కుండీలలో నాటుతారు.

నిజానికి మనీ ప్లాంట్ ఒక గాజు సీసాలో నాటడం ఎంతో మంచిది.వాస్తు శాస్త్రం ప్రకారం మనీప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉండటం ఎంతో మంచిది.

ఇక ఈ చెట్టు పెరుగుతున్నకొద్దీ ఈ చెట్టును తాడు సహాయంతో పైకి వేలాడుతూ ఉండేలా చూసుకోవాలి.ఇలా ఉండటం ఎంతో మంచిది.

ఈ విధంగా మనీప్లాంట్ పాకుతూ వెళ్లడం వల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి సంతోషం పుష్కలంగా లభిస్తాయి.

ఇక ఇంటి ఉత్తర ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉండటం వల్ల సరికొత్త ఆదాయ వనరులు వస్తాయి.ఇక ఈ చెట్టుని ఎప్పుడూ కూడా పొడిగా ఉండ నివ్వకూడదు.నిత్యం ఈ చెట్టుకు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి.

ముఖ్యంగా ఇంటి ఆవరణంలో ఈ మొక్క ఎలాంటి పరిస్థితులలో ఉండ కూడదు.ఈ మొక్క ఎల్లప్పుడు ఇంటి లోపలే ఉండేలా చూసుకోవాలి .

అలాగే ఈ మొక్క పై ఇతరుల దృష్టి పడకుండా ఉండేలా చూసుకోవడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటు వంటి ఆర్థిక సమస్యలు లేకుండా… ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube