ఈనెల 26వ తేదీన హజ్ యాత్ర ( Hajj )ప్రారంభమైంది.అయితే ఈ యాత్రలో భాగంగా ప్రపంచంలోనీ నలుమూలల నుండి లక్షలాది ముస్లింలు సౌదీ అరబ్ లోని మక్క కు చేరుకుంటారు.
ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది.అదే సైతాన్ను రాళ్లతో కొట్టడం.
ఈ ప్రక్రియ వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.హజ్ లో సైతాన్ను రాళ్లతో కొట్టే ప్రక్రియ హజ్ లోనే మూడవరోజు జరుగుతుంది.
అయితే ఆ రోజునే బక్రీద్ పండుగ( Bakrid festival ) జరుపుకుంటారు.బక్రీద్ నాడు హజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు.
అప్పుడు అక్కడ వారు సైతాన్ను మూడుసార్లు రాళ్లతో కొడతారు.

మీనా పట్టణంలోని మూడు వేరువేరు ప్రాంతాల్లో నిర్మితమైన వివిధ స్తంభాలను రాళ్లతో కొడతారు.దీనిలోని మొదటి స్థంభం జమ్రాహె ఉక్వా( Jamrahe Ukwa ), రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా.ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం.హజ్ లో పాల్గొన్నవారు మూడుసార్లు రాళ్లతో స్తంభాలను కొడతారు.అయితే ఒకానొకప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్( Hazrat Ibrahim is Satan ) ను పారదొలెందుకు ఈ స్తంభాలను రాళ్లతో కొట్టారని చెబుతారు.
ఆ సమయంలో ఇబ్రహీం తన కుమారుని కుర్బానీ ఇచ్చేందుకు వెళుతుండగా సైతాన్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడు.

అప్పుడు హజ్రత్ ఈ స్తంభాలను సైతాన్ కు ప్రతీకలుగా భావించి రాళ్లతో కొట్టారు.మొదటి రోజు కేవలం మొదటి స్తంభాన్ని కొట్టారు.ఆ తర్వాత మిగిలిన రెండు రోజుల్లో రెండు స్తంభాలను కొట్టారు.
ఈ విధంగా హజ్ లో సైతాన్ ను పారదోలేందుకు రాళ్లతో హజ్ యాత్రికులు కొడతారు.అయితే హజ్ యాత్ర చెయ్యాలంటే తప్పనిసరిగా ముస్లింలు అయి ఉండాలి.
అలాగే యాత్రలో పాల్గొనే వారు ఎర్హమా ధరించాల్సి ఉంటుంది.ఈ యాత్రలో మహిళలు పాల్గొంటే వారు తల నుంచి పాదాల వరకు కప్పి ఉండే దుస్తులను ధరించి ఉండాలి.