దేవస్థానాలకు వచ్చే భక్తులకు ప్రశాంతంగా ఉండాలి.అలాగే దేవుని భక్తితో పూజించే వాతావరణం తప్పనిసరిగా ప్రశాంతంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
అప్పుడే నిష్టతో పూజించిన భావన కలుగుతుంది.కానీ క్షణక్షణం మోగే మొబైళ్లు, సెల్ఫీలు, వీడియోల గోల దేవాలయాలలో ప్రశాంతతకు భంగం కలిగిస్తోంది.
దేవాలయానికి వచ్చిన ఇదేమి బెడద అని ప్రశాంతంగా ఉండే భక్తులు తల పట్టుకునే రోజులు దూరమవుతున్నాయి.రాష్ట్రంలోని దేవాలయ శాఖ పరిధిలోని దేవస్థానాలలో ఇప్పటి నుంచి ఈ మొబైల్ ఫోన్ వాడకన్ని సర్కార్ నిదేశించింది.

కర్ణాటక( Karnataka ) హిందూ దేవాలయ అర్చకులు ఒక్కుటా అప్పటి మంత్రి శశికళ( Sasikala ) జొల్లేను కలిసి వినతి పత్రం అందజేసింది.పూజ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో భక్తులు మొబైల్ ఫోన్ లను వాడడం, అశ్లీల రింగ్‌టోన్ల పాటలు, అలాగే సెల్ఫీలు, వీడియోలు తీయడం వల్ల ఇబ్బందికరంగా ఉంది.ఇక అశ్లీల రింగ్‌టోన్ల వల్ల దేవాలయలలోని పవిత్రత దెబ్బతింటుంది.కాబట్టి దేవాలయాల ఆవరణలోకి మొబైల్ ఫోన్ లను తీసుకురాకూడదని ఆదేశించాలని అర్చకులు కోరారు.దేవాలయం బయట మొబైల్ ఫోన్ లను భద్రపరచడానికి వసతి కల్పించాలని సూచించారు.ఈ విషయాన్ని పరిగణించిన దేవాదాయ శాఖ మొబైల్ ఫోన్ లపై నిషేధం ఆదేశాలు జారీ చేసింది.

ఇటువంటి రోజులలో మొబైల్ ఫోన్లు లేని ప్రదేశం అంటూ లేదు.కొందరి వద్ద రెండు ఫోన్లో కూడా ఉంటున్నాయి.భక్తులు దేవాలయాలకు వచ్చినప్పుడు ఫోన్ల శబ్దాల వల్ల పూజారులకు, సహచర భక్తుల కు ప్రశాంతత కరువైపోయింది.దీనిపై ఎప్పటినుంచో ఫిర్యాదులు ఉన్నాయి.దీనితో దేవాదాయ శాఖ తన పరిధిలోగల దేవాలయాలలో భక్తులు మొబైల్ ఫోన్లో స్విచాఫ్ చేసుకుని దేవుని దర్శనం చేసుకోవాలని సూచించింది.ఆ మెరకు బోర్డులు పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా చెప్పాలంటే మొబైల్ ఫోన్ వాడకం, ఫోటోలు తీయడం కూడా నిషేధించారు.