ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం అనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగించాలని చాలామంది భావిస్తారు.
అయితే పెళ్లిళ్లు ఖాయం చేసే వినాయక స్వామి గుడి గురించి మనలో చాలామంది ఎప్పుడూ విని ఉండరు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఉత్తర కర్ణాటక( Uttara Karnataka )లోని హెన్నావర్ లోని ఇడగుంజి( Idagunji Ganesha Temple )లో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని పండితులు సైతం చెబుతున్నారు.
ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారట.సాధారణంగా వినాయకుడు ఏ గుడిలో అయినా నాలుగు చేతులతో దర్శనమిస్తాడు.
అయితే ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు రెండు చేతులతో దర్శనమిస్తాడు.ఈ క్షేత్రం వినాయకుడు కోరి వెలిసిన క్షేత్రం అని సమాచారం అందుతోంది.
ఎలుక వాహనం లేకుండానే ఈ ఆలయంలో వినాయకుడు కనిపిస్తారని బోగట్టా.

ఈ ఆలయానికి అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు ఉందని సమాచారం అందుతోంది.1500 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించారని తెలుస్తోంది.పెళ్లి సంబంధం కుదిరిన వెంటనే ఇక్కడ వినాయక స్వామి( Ganesha ) చెంత రెండు చీటీలను ఉంచుతారు.
కుడి పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం ఉందని ఎడమ పాదం దగ్గర ఉన్న చీటీ కింద పడితే దేవుని అంగీకారం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవుని అనుగ్రహం లేదని భావించిన వాళ్లు మరో సంబంధం వెతుక్కుంటారని సమాచారం అందుతోంది.ఈ ఆలయంలో ఏదైనా కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని తెలుస్తోంది.ఈ ఆలయంలో పంచఖాద్య పేరుతో ప్రత్యేకంగా ప్రసాదం చేసి విక్రయిస్తారు.
ఈ ఆలయానికి బస్సు, రైలు మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే మంచిది అని చెప్పవచ్చు.