శ్రీశైలంలోనీ శిఖర దర్శనం చేసుకుంటే మరో జన్మ ఉండదా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న మహామహిమాన్విత శైవ క్షేత్రాలలో శ్రీశైలా పుణ్యక్షేత్రం( Srisailam ) ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.ఇది కేవలం శైవ క్షేత్రమే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలలో( Jyotirlinga ) ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ఉందని పండితులు చెబుతున్నారు.

 History Of Srisailam Peak Details, Srisailam , Srisailam Peak ,shakti Peethas-TeluguStop.com

శక్తి పీఠం జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కూడా ఇదే అని చెబుతున్నారు.ఈ పుణ్యక్షేత్రనికి వచ్చే భక్తులు భ్రమరాంబ మల్లికార్జున దర్శనం తర్వాత తప్పకుండా శిఖర దర్శనం చేసుకుంటారని కూడా చెబుతున్నారు.

ఈ పుణ్య దర్శనమైతే మరో జన్మ ఉండదని చాలామంది భక్తులు విశ్వసిస్తున్నారు.దీని వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లేందుకు ఎలాంటి దారి ఉండేది కాదు.

Telugu Andhra Pradesh, Jyotirlinga, Lord Shiva, Shakti Peethas, Srisailam, Srisa

అటువైపు కర్ణాటక నుంచి ఇటు త్రిపురాంతం నుంచి వచ్చే భక్తులు తమకు తోచిన బాటను పట్టుకుని క్రూర మృగాలు సంచరించే నల్లమల్ల అడవిలో బృందాలుగా నడిచి పుణ్యక్షేత్రానికి వచ్చేవారు.ఒక్కోసారి దారి మధ్యలో భారీ వర్షం వచ్చినప్పుడు గుడి వరకు వెళ్లలేకపోయిన సందర్భంలో దూరంగా కనిపించే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుని ఇళ్లకు వెళ్లిపోయేవారు.అప్పటి కొండ వీటి రెడ్డి రాజుగారైన ప్రోలయ వేమారెడ్డి(Prolaya Vema Reddy ) శ్రీశైలం వెళ్లేందుకు దారిని ఏర్పాటు చేయించిన తర్వాత భక్తుల రద్దీ పెరిగింది.

ఆ తర్వాత దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వరం అనే కొండ పై ఉన్న నందికొమ్ముల మధ్య నుంచి దేవలయ శిఖరాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది.

Telugu Andhra Pradesh, Jyotirlinga, Lord Shiva, Shakti Peethas, Srisailam, Srisa

అప్పటి నుంచి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ జన్మ లేదని చెబుతూ ఉంటారు.శిఖరేశ్వరం దగ్గర చిన్న నంది విగ్రహం ఉంటుంది.నందీశ్వరుని పై నువ్వులు చల్లి ఈశ్వరుని స్మరించి స్వామి ప్రధానాలయ శిఖరం వైపు తిప్పి నందికొమ్ముల నుంచి స్వామి దేవాలయ శిఖర దర్శనం చేసుకుంటారు.

అక్కడి నుంచి శిఖరం కనిపిస్తే మళ్లీ మనిషి జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube