తెలంగాణలో జనసేనకు 10 లేదా 12 స్థానాలు ఇవ్వనున్న బీజేపీ..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఏన్డీయేలో మిత్రపక్షమైన జనసేనతో పొత్తు పెట్టుకోనుంది.

 Bjp Will Give 10 Or 12 Seats To Janasena In Telangana..!?-TeluguStop.com

ఈ నేపథ్యంలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు.జనసేనతో పొత్తు నేపథ్యంలో 12 వరకు సీట్లను ఆ పార్టీకి ఇవ్వాలని తెలంగాణ బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణలోని మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే అందులో పది నుంచి 12 స్థానాలను జనసేనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.

ఖమ్మం జిల్లాలో ఎనిమిది, నల్గొండలో రెండు స్థానాలతో పాటు హైదరాబాద్, వరంగల్ లో ఒక్కో స్థానం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube