తెలంగాణలో జనసేనకు 10 లేదా 12 స్థానాలు ఇవ్వనున్న బీజేపీ..!?
TeluguStop.com
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఏన్డీయేలో మిత్రపక్షమైన జనసేనతో పొత్తు పెట్టుకోనుంది.ఈ నేపథ్యంలో టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు.
జనసేనతో పొత్తు నేపథ్యంలో 12 వరకు సీట్లను ఆ పార్టీకి ఇవ్వాలని తెలంగాణ బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణలోని మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాని పవన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే అందులో పది నుంచి 12 స్థానాలను జనసేనకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఖమ్మం జిల్లాలో ఎనిమిది, నల్గొండలో రెండు స్థానాలతో పాటు హైదరాబాద్, వరంగల్ లో ఒక్కో స్థానం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 4, బుధవారం 2024