మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను సాగు చేస్తేనే రైతులు అధిక లాభాలు పొందగలుగుతారు.ఒకే తరహా పంటలు కాకుండా అన్ని రకాల పంటలను సాగు చేస్తేనే పొలంలో పంట మార్పిడి చేసినట్టు ఉండడంతో పాటు అధిక దిగుబడి సాధించడానికి వీలుంటుంది.
ఉలవలకు ( ulavalu )మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.ఈ ఉలవను వర్షాధారంగా లేదా పంటలు వేయడానికి సమయం అయిపోయిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ పంటగా ఉలవను సాగు చేయవచ్చు.
వేసవికాలంలో లోతు దుక్కులు దున్నుకున్న తర్వాత గొర్రుతో మెత్తగా నేలను తయారు చేయాలి.నాగలి లేదా గుర్రుతో సాళ్ళ మధ్య 30 సెంటీమీటర్ల ఎడంలో గింజలు సమంగా పడేటట్లు పదునులో విత్తుకోవాలి.
విత్తుకోవడానికి ముందు ఒక కిలో విత్తనాలకు ఒక గ్రాము కార్బండిజమ్( Carbandism ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఎరువుల విషయానికి వస్తే.ఒక ఎకరం పొలానికి రెండు టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించాలి.100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార వేసి ఓ పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి.ఈ చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానిపై 200 గ్రాముల రైజోబియం ( Rhizobium )కల్చర్ పొడిని కలిపి విత్తనం చుట్టూ పొరలాగా ఏర్పడేటట్లు చేసుకోవాలి.
ఆ తరువాత విత్తనాన్ని కాసేపు నీడలో ఆరబెట్టాలి.పొలంలో విత్తిన తర్వాత 40 రోజుల వరకు ఎప్పటికప్పుడు కలుపు లేకుండా నివారిస్తూ ఉండాలి.ఇక పూత పిందే, దశలలో వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తాయి.ఆ సమయంలో తొలి దశలోనే పంటను ఆశించే చీడపీడలను నివారించాలి.
పంట 100% ఎండిన తర్వాత కోతలు కోయాలి.కోతల తర్వాత మూడు లేదా నాలుగు రోజులు వరకు పంట చేనులోనే పంటను బాగా ఎండనివ్వాలి.
ఆ తర్వాత నూర్పిడి చేసి గింజలను శుభ్రపరిచి రెండు రోజులు ఎండలో ఎండనిచ్చి తేమశాతాన్ని చూసి నిల్వ చేసుకోవాలి.