వయసును తగ్గించే గోధుమలు.. ఇలా వాడితే మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే!

గోధుమలు( Wheat ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 How To Get Youthful Skin With Wheat Flour! Youthful Skin, Skin Care, Skin Care T-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా బియ్యంతో పాటు గోధుమల వినియోగం కూడా భారీగా ఉంది.అయితే గోధుమలు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడానికి కూడా అద్భుతంగా సహాయపడతాయి.

గోధుమల్లో విటమిన్ ఈ, జింక్ వంటి పోషకాలు మెండుగా నిండి ఉంటాయి ఇవి మన వయసును తగ్గించి చూపిస్తాయి.అందాన్ని రెట్టింపు చేస్తాయి.

అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను చేకూరుస్తాయి.మ‌రి ఇంతకీ గోధుమలను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Skin Care, Skin Care Tips, Wheat, Wheat Benefits, Wheat Face

ముందుగా గోధుమ‌ల‌ను పిండి చేసి స్టోర్ పెట్టుకోవాలి.లేదా మార్కెట్ లో మ‌న‌కు ఎల్ల‌ప్పుడూ గోధుమపిండి అందుబాటులోనే ఉంటుంది.దాన్ని కూడా తెచ్చుకోవ‌చ్చు.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై ఏమైనా ముడతలు ఉంటే మాయం అవుతాయి.

సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

Telugu Tips, Skin, Skin Care, Skin Care Tips, Wheat, Wheat Benefits, Wheat Face

అలాగే చర్మం పై మృత కణాలు తొలగిపోతాయి.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.చర్మం ఎల్లప్పుడూ అందంగా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.

మరియు డ్రై స్కిన్ సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి వయసు పై బ‌డిన అందంగా యవ్వనంగా మెరిసిపోవాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube