అమ్మతనం అనేది ఎంత గొప్పదో, మరెంత మధురమైనదో మాటల్లో వర్ణించలేము.అందుకే అమ్మ అన్న పిలుపు కోసం పెళ్లైన ప్రతి మహిళా ఆరాటపడుతుంది.
అయితే అమ్మ అయిన తర్వాత చర్మం మునుపటి మాదిరి అందంగా, కాంతివంతంగా కనిపించదు.ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.
హార్మోన్ ఛేంజస్, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, అలసట, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఆయా చర్మ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
దాంతో ఆ సమస్యలను వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను వాడితే.అమ్మ అయిన తర్వాత కూడా అందంగా, కాంతివంతంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రీమ్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కడిగిన బియ్యం, అర కప్పు వాటర్ వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక టమాటోను తీసుకుని గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్ పండుకు ఉన్న తొక్కలను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్‌లో నానబెట్టుకున్న బియాన్ని వాటర్‌తో సహా వేసుకోవాలి.
అలాగే టమాటో ముక్కలు, ఆరెంజ్ తొక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి స్ట్రైనర్ సాయంతో క్రీమ్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆలోవెర జెల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే క్రీమ్ సిద్ధం అవుతుంది.నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.
రోజూ ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.
మరియు సాగిన చర్మం టైట్‌గానూ మారుతుంది.