స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో ఈ రోజు థియేటర్లో విడుదలైన సినిమా ‘లైగర్’.విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ఆలీ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు.ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ పై కరణ్ జోహార్, ఛార్మి కౌర్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్, పూరి జగన్నాథ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
తెలుగుతో పాటు పలు భాషలలో వచ్చిన ఈ సినిమాపై ముందుగానే భారీ అంచనాలు వెలువడ్డాయి.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్, లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా వారిని ఎలా ఆకట్టుకుందో.అంతే కాకుండా విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికొస్తే కరీంనగర్ కి చెందిన కుర్రాడుగా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. ఇక అతని తల్లి రమ్యకృష్ణతో కలిసి చాయ్ బండి పై ఊరూరా తిరుగుతూ ఛాయ్ అమ్ముకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఎం ఎం ఎ ఫైట్ లో పాల్గొంటారు.ఇక దేశ త్రివర్ణ పథకాన్ని అక్కడ ఎలా ఎగురవేస్తారు అనేది కథాంశంలోకి వస్తుంది.
ఆ తర్వాత రమ్యకృష్ణ తన కొడుకు లైగర్ కు తన తండ్రి గురించి నిజాన్ని బయటపెడుతుంది.ఇక అప్పటినుండి మరో ట్విస్ట్ మొదలవుతుంది.మైక్ టైసన్ ఎవరు లైగర్ కు ఏమవుతాడు.లైగర్ తన డ్రీమ్ నెరవేర్చుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
విజయ్ దేవరకొండ తన పాత్రతో అద్భుతంగా కనిపించాడు.అంతేకాకుండా ఆయన మేక్ ఓవర్ బాగా ఉంది అని చెప్పవచ్చు.ఇక అనన్య పాత్రకు అంత స్కోప్ లేదు.రమ్యకృష్ణ మాత్రం తన పాత్రతో ఎప్పటిలాగే న్యాయం చేసింది.మైక్ టైసన్, రోనిత్ రాయ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే పూరి ఈ సినిమాకు రొటీన్ కథ అందించాడు.ఇక మణిశర్మ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నీషియన్ విభాగాలు బాగా పని చేశాయి.

విశ్లేషణ:
సినిమా చూస్తుంటే ఇది వరకే చూసిన సన్నివేశాలు లాగా అనిపించింది.కానీ విజయ్ పాత్ర మాత్రం బాగా చూపించారు.మధ్యలో కొన్ని సన్నివేశాలు బాగా ట్విస్ట్ గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, సంగీతం, మాస్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ స్టంట్స్, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉన్నట్లు అనిపించింది.కొన్ని సన్నివేశాలు నిదానంగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
కథ రొటీన్ గా అనిపించిన కూడా పూరి, విజయ్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.ముఖ్యంగా యాక్షన్ స్టంట్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.