టపాసుల కొట్టు పెట్టావా... అంటూ బండ్లన్న ని ఆడుకుంటున్న నెటిజన్లు...

సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ తన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆ తర్వాత సినీ నిర్మాతగా మారి బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ మధ్య సినిమాల్లో నటించడం మానేసిన బండ్ల గణేష్ రాజకీయాల్లోకి కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి తన సేవలను అందించాడు.

 Netizens Trolling To To The Bandla Ganesh In Social Media, Social Media, Bandla-TeluguStop.com

 కానీ గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడంతో రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.అయితే అప్పటి నుంచి బండ్ల గణేష్ సోషల్ మీడియా మాధ్యమాలలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
  తాజాగా బండ్ల గణేష్ రోజు దీపావళి పండుగ సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్ల కి పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే తాను కొన్నటువంటి టపాసులను ప్రేక్షకులకు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేశాడు.

దీంతో కొందరు నెటిజన్లు బండ్ల గణేష్ ని  నెగటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాక అత్యధిక మోతాదులో టపాసులు కాల్చడం వల్ల పర్యావరణంలోని కాలుష్యం దెబ్బతింటుందని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి వాళ్లే ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే “అన్ని టపాసులు ఎందుకు కొన్నావు బండ్లన్న. టపాసుల కొట్టు ఏమైనా పెట్టావా.?” అంటూ వ్యంగంగా ఎద్దేవా చేస్తున్నారు.

Telugu Bandla Ganesh, Bandlaganesh, Netizens, Netizensbandla, Tollywood-Latest N

అయితే ఈ విషయం ఇలా ఉండగా చాలా గ్యాప్ తర్వాత బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలోని ఓ కామెడీ సన్నివేశంలో నటించాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube