డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్.( Mr Pregnant Movie ) ఇందులో బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్,( Sohel ) రూప కొడువాయుర్,( Roopa Koduvayur ) సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందించగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు.ఇక ఈ సినిమాకు అప్పిరెడ్డి, సజ్జల రవి రెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.
డ్రామా, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదల అయింది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఫిదా చేయడమే కాకుండా అంచనాలు కూడా పెంచాయి.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో.అంతేకాకుండా హీరోగా మంచి సక్సెస్ అందుకోవడం కోసం ఆరాటపడుతున్న సోహెల్ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో సోహెల్ గౌతమ్ ( Gautam ) అనే టాటూ ఆర్టిస్టుగా కనిపిస్తాడు.
టాటూ వేయటంలో తనను మించిన వారు ఎవరు లేరని చెప్పాలి.టాటూ కు సంబంధించిన ఎక్కడ కాంపిటీషన్ జరిగిన కూడా తనే ఫస్ట్ ప్రైజ్ అందుకుంటాడు.
అయితే మహి (రూప కొడువాయుర్)( Mahi ) గౌతమ్ ని ఇష్టపడుతుంది.అతడిని చాలా గాఢంగా ప్రేమిస్తుంది.
కానీ గౌతమ్ మాత్రం తను ఇష్టపడడు.అయితే ఓసారి గౌతం ఫుల్లుగా తాగేసి మహికి ఒక కండిషన్ పెడతాడు.
అదేంటంటే పిల్లలు వద్దనుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.దీంతో మహి అతడిని ప్రేమించింది కాబట్టి అతడిని పెళ్లి చేసుకోవడానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
దీంతో గౌతమ్ మహికి తన మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటాడు.అంతేకాకుండా ఆపరేషన్ చేయించకుండా ఆపేసి పెళ్లికి ఒప్పుకుంటాడు.
కానీ మహి తల్లిదండ్రులు మాత్రం వారి పెళ్లికి ఒప్పుకోడు.ఇక మహి ఏమి చేయలేక ఇంట్లో నుంచి వచ్చేసి గౌతమ్ ని పెళ్లి చేసుకుంటుంది.
అయితే మరి గౌతమ్ కు గర్భం ఎలా వచ్చింది.పిల్లలు ఇష్టం లేదన్న గౌతమ్ ఎలా గర్భం పొందుతాడు.
చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే.సోహెల్ గౌతమ్ పాత్రలో అద్భుతంగా నటించాడు.ఎమోషన్స్ సీన్స్ లో కూడా అందర్నీ కనెక్ట్ చేసాడు.
హీరోయిన్గా నటించిన రూప కొడువాయుర్ కూడా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.తను కూడా లవ్ సీన్స్ లో,( Love Scenes ) ఎమోషనల్ సీన్స్ లో అందర్నీ ఫిదా చేసింది.
డాక్టర్ వసుధ పాత్రలో నటించిన సుహాసిని( Suhasini ) కూడా ఈ పాత్ర ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి.మిగిలిన నటీనటులంతా తమ పాత్రకు తగ్గట్టుగా పనిచేశారు.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.డైరెక్టర్ డిఫరెంట్ కథను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
శ్రవణ్ భరద్వాజ్ అందించిన పాటలు పరవాలేదు.బ్యాగ్రౌండ్ మ్యూజిక్( BGM ) అద్భుతంగా ఉంది.
కెమెరా పనితనం కూడా బాగుంది.నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

విశ్లేషణ:
సినిమా మొదట మామూలు కథతో ప్రారంభమైనట్లు అనిపిస్తుంది.ఇక హీరోయిన్ హీరోని ఎందుకు అంత ఇష్టపడింది అనే విషయాన్ని మాత్రం చూపించలేదు.మొదట 45 నిమిషాలు కథ సాగినట్లుగా అనిపించదు.ఇక ఎప్పుడైతే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు అప్పటినుంచి స్టోరీ మారిపోతుంది.ఇక హీరో పిల్లల్ని వద్దనుకున్న విషయాన్ని మాత్రం ఎమోషనల్ గా చూపించారు.ఇంటర్వెల్ కూడా బాగా ఆకట్టుకుంది.
ఇక హీరో ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత అతడికి ఎదురైన అవమానాలు, వాటి వల్ల పడిన బాధలను బాగా చూపించారు.ఇక ఆడవారి గొప్పతనం గురించి కూడా క్లైమాక్స్ లో బాగా చూపించారు.

ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే.డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను చూడవచ్చని చెప్పాలి.