నాగచైతన్య( Naga Chaitanya ) రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాదే చైతన్య పెళ్లి జరగనుండగా చైతన్య శోభిత జోడీకి సంబంధించిన కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య రెండో పెళ్లి గురించి ఎక్కువమంది పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు.కొంతమంది ట్రోల్స్ చేస్తున్నా శోభితను( Sobhita ) ట్రోల్స్ చేస్తున్నారే తప్ప చైతన్యను చేయడం లేదు.
అయితే సమంత( Samantha ) రెండో పెళ్లి చేసుకుంటానంటే ఇలా రియాక్ట్ అవుతారా అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గతంలో పలువురు నటీమణులు రెండో పెళ్లి చేసుకోవడం లేదా రెండో పెళ్లి( Second Marriage ) గురించి కామెంట్లు చేయడంతో ఆ సమయంలో ఆ కామెంట్లు ఒకింత సంచలనం అయ్యాయనే చెప్పాలి.
ఆ సమయంలో ఆయా నటీమణులపై ఊహించని స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
సమంతకో న్యాయం నాగచైతన్యకో న్యాయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చైతన్య శోభిత వివాహం గురించి భవిష్యత్తులో సమంత రియాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమంత ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
సమంత నటించిన సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాదే స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.
సమంత ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.సమంత వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సమంత సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.