పవన్ కళ్యాణ్( pawan kalyan ) అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా( Hari hara veeramallu movie ) అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.క్రిష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం.
ఆయన సినిమా లకు విభిన్నంగా ఉండటంతో పాటు కమర్షియల్ గా కూడా ఆకట్టుకుంటాయి.ఆయన నుండి సినిమా అది కూడా పవన్ కళ్యాణ్ హీరో అది కూడా పీరియాడిక్ డ్రామా అనగానే వావ్ అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.

సినిమా షూటింగ్ ప్రారంభం అయి చక చక కొన్నిషెడ్యూల్స్ జరిగాయి.కొన్ని ఫోటోలు.వీడియోలు వచ్చాయి.వాటి వల్ల సినిమా పై అంచనాలు పెరిగాయి.తీరా సినిమా ను ముగించకుడా రెండేళ్లుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు.అసలు ఈ సినిమా ఇంత ఆలస్యం అవుతూ ఉంటే నిర్మాత ఏ ఎం రత్నంకు నష్టం రావడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో బ్రో సినిమా( Bro movie ) ప్రీ రిలీజ్ వేడుకలో వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నం పాల్గొన్నాడు.ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో చాలా సాన్నిహిత్యంగా ఉన్నట్లుగా అనిపించింది.
అంతే కాకుండా వీరమల్లు సినిమా గురించి ఆయన పెద్దగా మాట్లాడక పోవడంతో అసలు ఏం జరిగింది.

వీరమల్లు సినిమా ఉందా లేదా అన్నట్లుగా చర్చ మొదలు అయింది.హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటో అర్థం అవ్వడం లేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.నిర్మాత ఏ ఎం రత్నంకు సినిమా ఆలస్యం అయినా.
క్యాన్సిల్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది లేనట్లుగా ఉంది అంటూ కొందరు సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.ఇంతకు హరి హర వీరమల్లు ఉందా లేదా అనేది క్లారిటీ రావాలి.







