తండ్రి కాబోతున్న బిగ్ బాస్ అమర్... అందరి ముందు అసలు విషయం చెప్పిన యాంకర్?

బుల్లితెర నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమర్ దీప్ చౌదరి( Amar Deep Chowdary ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

 Amardeep Teju To Became A Parents Soon Details, Amardeep,tejaswini, Bigg Boss,pa-TeluguStop.com

ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.ఇక మరో బుల్లితెర నటి తేజస్విని గౌడ( Tejaswini Gowda ) ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుందని ఈ జంటకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.

Telugu Amardeep, Bigg Boss, Sreemukhi, Maa, Tejaswini, Day-Movie

ఇక అమర్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.ప్రస్తుతం ఈయన హీరోగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే( Valentines Day ) పురస్కరించుకొని స్టార్ మా ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.ఇందులో భాగంగా సెలబ్రిటీ కపుల్స్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జంట రొమాంటిక్ పర్ఫామెన్స్ చేశారు.

Telugu Amardeep, Bigg Boss, Sreemukhi, Maa, Tejaswini, Day-Movie

ఇక అమర్ తేజు ఇద్దరు కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించి వేదికపై రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ శ్రీముఖి( Sreemukhi ) అమర్ తేజ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అమర్ తేజు త్వరలోనే తల్లిదండ్రులు( Parents ) కాబోతున్నారని వారికి ఓ బేబీ రాబోతుంది అంటూ ఈమె అసలు మేటర్ బయట పెట్టారు.మరి శ్రీముఖి సరదాగా అలా మాట్లాడిందా లేకపోతే నిజంగానే అమర్ తండ్రి కాబోతున్నాడు అన్న విషయం తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube